Homeవార్తలుతెలంగాణమున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు సిపిఐ, ఏఐటీయూసీ మద్దతు

మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు సిపిఐ, ఏఐటీయూసీ మద్దతు

మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు సిపిఐ, ఏఐటీయూసీ మద్దతు

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సోమవారం 9 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్ సానిటేషన్, తదితర విభాగాల కార్మికులకు సిపిఐ, ఏఐటీయూసీ నేతలు మద్దతు పలికారు. సిపిఐ పట్టణ కార్యదర్శి జె రమేష్, ఏ ఐ టి యు సీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడారు. 9 నెలలు జీతాలు లేకుండా కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. ప్రతి నెల గడిచేందుకు నిత్యవసరాలు, ఆరోగ్యం, పిల్లల చదువులు తదితరఅవసరాలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రతినెల 1వ తేదీన్నే వేతనాలు చెల్లించాలన్నారు. 9 నెలలుగా జీతం అందకపోవడంపై సమ్మె చేస్తున్న 17 మంది కార్మికుల మధ్య చీలిక తేవటం సరికాదన్నారు. వెంటనే జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారి పోరాటానికి చివరి వరకు అండగా ఉంటామన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీరామ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. (Story : మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు సిపిఐ, ఏఐటీయూసీ మద్దతు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!