అమర వీరుల ఆశయ సాధనకు అందరూ కృషి చేద్దాం
డీఎస్పీ శ్రీనివాసులు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : అమరవీరుల ఆశయ సాధనకు అందరూ కృషి చేద్దామని డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపానికి డిఎస్పి శ్రీనివాసులతోపాటు వన్టౌన్ సిఐ. నాగేంద్రప్రసాద్, టూ టౌన్ సిఐ రెడ్డప్ప, ట్రాఫిక్ ఎస్ఐ. వెంకటరాముడు, ఎస్సై గోపికృష్ణ తోపాటు, ఏఎస్ఐ కేతన్న, వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కలిసి అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి సెల్యూట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ, తమ విధి బాధ్యతను తెలిపారు. తదుపరి డిఎస్పి తో పాటు సిఐలు మాట్లాడుతూ పరిరక్షణ, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ,మత చాందసవాదులు, అసాంఘిక శక్తుల నుంచి సామాన్య మానవులకు రక్షణ కల్పించేందుకు పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నామని తెలిపారు. ప్రతి పోలీసు దేశానికి వెన్నెముక లాంటి వారిని తెలిపారు. ఈ అమరవీరుల వారోత్సవాలు ఏడు రోజులు పాటు జరుగుతాయని తెలిపారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : అమర వీరుల ఆశయ సాధనకు అందరూ కృషి చేద్దాం)