వాలంటీర్ల ఆవేదన పై ప్రభుత్వం స్పందించాలి
ఏఐవైఎఫ్ సకల రాజా
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : వాలంటీర్ల ఆవేదనపై ప్రభుత్వం స్పందించాలని,
తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి అని ఏఐవైఎఫ్ సకల రాజా తెలిపారు. ఈ సందర్భంగా పుట్టపర్తి లోని కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అనంతరం సకల రాజా మాట్లాడుతూ
గ్రామ స్థాయిలో మేము కీలంకంగా ప్రజలకు తక్కువ వేతనాలతో కీలకమైన సేవలు చేసాము అని,కరోనా సమయంలో చేసిన మా సేవలను గుర్తించండి అని పేర్కొన్నారు. -తక్షణమే నాలుగు నెలలుగా ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వాలి అని, -త్వరలో జరగబోయే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో విధుల్లోకి తీసుకొనేట్లు నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వాలంటీర్లుగా గ్రామ స్థాయిలో ప్రజలకు కీలకంగా సేవలు చేసామని అది గుర్తించే టిడిపి మేనిఫెస్టో లో వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అతి తక్కువ వేతనంతో ప్రజలకి నిశ్వార్ధంతో ప్రజలకు సేవ చేశారని, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా వున్నారన్నారు. వారిలో మంచి విద్యార్హతలు వున్నవారున్నరన్నారు. ఒక పార్టీకి అనుబంధం గా పని చేశారానేది అవాస్తవం అని, కొంత మంది అలా చేస్తే అందరికి ఆపడించాదించడం దారుణం అన్నారు. ఏ పార్టీకి సంభందం లేని నిరుద్యోగులే వీరంతా అని అన్నారు. తొందరలో జరిగే క్యాబినెట్ సమావేశం నిర్ణయం చేయాలని,మానిఫెస్టో లో చెప్పినట్లుగా 10 వేల వేతనం తో తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి పుట్టపర్తి పట్టణ సెక్రటరీవినోద్ కుమార్, పవన్, వెంకటేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. (Story : వాలంటీర్ల ఆవేదన పై ప్రభుత్వం స్పందించాలి)