రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుంది
డిఎస్పీ శ్రీనివాసులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కన్నా వెంకటేష్ మాట్లాడుతూ అమరవీరుల దినోత్సవం ను పురస్కరించుకొని పట్టణంలో కళా జ్యోతి సర్కిల్ దగ్గర గవర్నమెంట్ హై స్కూల్ నందు పోలీసు అమరవీరులతో దినోత్సవ సందర్భంగా రజిని ట్రస్టు, రక్త బంధం ట్రస్టు ఆధ్వర్యంలో ధర్మవరం పోలీస్ వారి సహకారంతో విజయవంతంగా నిర్వహించారు అని తెలిపారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా సబ్ డివిజన్ పోలీస్ అధికారి శ్రీనివాసులు, వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, టూ టౌన్ సిఐ రెడ్డప్ప, రూరల్ ఏఎస్ఐ, ఎన్ నాగరాజు, 16వ వార్డు కౌన్సిలర్ కేత లోకేష్ సమక్షంలో దాదాపు 74 మంది రక్త దానం చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో వన్ టౌన్ సిఐ పి నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా ధర్మవరం పట్టణంలో ఘనంగా అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది అలాగే పట్టణంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సమాజం కోసం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాం ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది కన్నా వెంకటేష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోనూ రక్తదానం గొప్పది. ఈరోజు ఇంత కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుముఖ్య అతిథులు సబ్ డివిజన్ పోలీస్ అధికారి శ్రీనివాసులు గారు వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ టూ టౌన్ సిఐ రెడ్డప్ప రూరల్ ఏ ఎస్ ఐ నాగరాజు కేత లోకేష్. హెచ్డిఎఫ్ బ్యాంక్ సుబ్బరాయుడు సిబ్బంది రజిని ట్రస్టు సభ్యులు కన్నా వెంకటేష్ రక్త బంధం ట్రస్టు సభ్యులు ఉదయ్ కుమార్ జయప్రకాష్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. (Story : రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుంది)