స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ చల్లా శ్రీనివాసులు శెట్టి కి మాజీ మంత్రి ఘన సన్మానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ గా నియమితులు అయిన తర్వాత మొదటిసారి వనపర్తికి విచ్చేసిన చల్లా.శ్రీనివాసులు ని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. చల్లా.శ్రీనివాసులుతో ప్రత్యేకంగా భేటీ అయిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలోనీ పలు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా S.B.H ఛైర్మెన్ మాట్లాడుతూ రాబోవు కాలంలో విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఒక 100 విద్యాసంస్థలు, నైపుణ్య సంస్థలను ఏర్పాటు చేసి వారికి ఋణ సదుపాయం కలిపించి ప్రపంచములో అగ్రభాగములో నిలిపేందుకు కృషి చేస్తామని అన్నారు. జిల్లా వాసి అయిన శ్రీనివాసులు తన ప్రతిభాపాటవాలతో అత్యున్నత స్థానానికి చేరుకున్నందుకు మరోసారి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంజన్ రెడ్డి వెంట జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,ప్రేమ్ నాథ్ రెడ్డి,గౌడ్ నాయక్ తదితరులు ఉన్నారు. (Story :స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ చల్లా శ్రీనివాసులు శెట్టి కి మాజీ మంత్రి ఘన సన్మానం )