UA-35385725-1 UA-35385725-1

‘కేసీఆర్’ ట్రైలర్ చాలా బావుంది

‘కేసీఆర్’ ట్రైలర్ చాలా బావుంది

సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ 

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: -‘కేసీఆర్’ ట్రైలర్ చూసినప్పుడు చాలా ప్రౌడ్ గా అనిపించింది. రాకింగ్ రాకేష్ చాలా హానెస్ట్ గా తీసిన సినిమా ఇది. మీ అందరి సపోర్ట్ కావాలి: యాక్ట్రస్ అనసూయ

-రాకింగ్ రాకేష్, అన్నన్య కృష్ణన్, గరుడవేగ అంజి, విభూది క్రియేషన్స్ కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) ఎమోషనల్ ప్యాక్డ్ ట్రైలర్ లాంచ్
రాకింగ్ రాకేష్ లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్), గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొందింది. మేకర్స్ ఈరోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
కేశవ చంద్ర రమావత్ (కెసిఆర్), అతని మరదలు మధ్య చిన్ననాటి స్నేహాన్ని ప్రజెంట్ ద్వారా ట్రైలర్ ప్రారంభమైయింది,అది క్రమంగా ప్రేమగా మారుతుంది. తన షార్ట్ నేమ్ కేసీఆర్‌ అని సగర్వంగా చెప్పుకునే ఆ యువకుడు కేసీఆర్‌తో ఎంతో స్ఫూర్తి పొందాడు. అయితే అతను తన చిన్ననాటి మరదలుతో మ్యారేజ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తాడు. కథ ఇలా సాగుతుండగా, కేసీఆర్ ఒక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు బయలుదేరుతాడు.
రాకింగ్ రాకేష్ మనసుని హత్తుకునే కథను రాసారు. గరుడ వేగ అంజి దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా కట్టిపడేశారు. ఈ కథనం గ్రామీణ తెలంగాణ సారాంశాన్ని, సంస్కృతిని అందంగా చూపించింది. చరణ్ అర్జున్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పవర్ ఫుల్ ఎమోషనల్ లేయర్‌ని యాడ్ చేసింది. బలగం మధు ఎడిటింగ్‌ బ్రిలియంట్ గా వుంది , మహేష్ బల్లంట్ ఆర్ట్ డైరెక్టర్. గోరెటి వెంకన్న, కాసర్ల శ్యామ్‌లు సాహిత్యం అందించారు.
రాకేష్, కేసీఆర్ పాత్రలో లీనమై హీరోగా ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ కనబరిచారు. అన్నన్య కృష్ణన్ బ్యూటీఫుల్ గా వుంది. తనికెళ్ల భరణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత, లోహిత్ కుమార్, బలగం మైమ్ మధు, రచ్చ రవి, కృష్ణ భగవాన్, అంజి, సాయి చరణ్ కిష్టప్ప, జబర్దస్త్ ప్రవీణ్, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ సన్నీ జబర్దస్ రాజు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాని మూడు ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించాలని నా కోరిక. దానికి మీరందరూ సపోర్ట్ కావాలి. సాయి రాజేష్ అన్న ఎంత థాంక్స్ చెప్పుకున్న తక్కువే. సాయి రాజేష్ అన్నకి నా ఎప్పటికీ రుణపడి ఉంటాను. అనసూయ గారు నన్ను జీరో దగ్గర నుంచి చూసిన వ్యక్తి. ఒక అమ్మలా చుసుకున్నారు. వారు ఈ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా వుంది. డైరెక్టర్ అంజన్న సినిమాని చాలా ఫ్యాషన్ తో తీశారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నన్ను ఒక బిడ్డ లాగా అన్ని నేర్పించారు. ఎన్ని క్రాఫ్ట్ లు ఉన్నాయో అన్ని క్రాఫ్ట్ లు నేర్పించారు. చరణ్ అర్జున్ అన్న అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన త్వరలో బిగ్ బ్యానర్స్ లో పనిచేయబోతున్నారు. నా సక్సెస్ కారణం నా భార్య సుజాత. ఈ జర్నీలో చాలా సపోర్ట్ చేశారు. మా సినిమాలో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.
డైరెక్టర్ అంజి మాట్లాడుతూ.. అందరికీ థాంక్యూ సో మచ్. రాకేష్ చాలా అద్భుతమైన కథను రాశారు. కథ విన్న వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పాను. సినిమాటోగ్రఫీ డైరెక్షన్ రెండు నేనే చేశాను. వండర్ఫుల్ కథ తీసుకువచ్చిన రాకేష్ కి థాంక్యూ సో మచ్. మా ట్రైలర్ లాంచ్ చేసిన సాయి రాజేష్ గారు అనసూయ గారికి థాంక్యూ సో మచ్ వారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారు ఎంకరేజ్ చేయడం నిజంగా మాకు ఒక సక్సెస్. అలాగే ఈవెంట్ కి వచ్చిన శివ బాలాజీ గారు శివారెడ్డి గారు, రేలంగి నరసింహారావు గారు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.ఈ సినిమాకి చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు లిరిక్స్ రాశారు. కొన్ని పాటలు పాడారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అన్ని హైలైట్ అవుతాయి. హీరోయిన్ అనన్య చాలా ఫెంటాస్టిక్ గా పెర్ఫామ్ చేసింది. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.
డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. హృదయ కాలేయం ఆడియో ఫంక్షన్ కి రాకేష్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్కిట్ చేసి వెళ్ళాడు. ఆ కృతజ్ఞత నాకు అలా ఉండిపోయింది. కొన్ని రోజులుగా ముంబైలో ఉన్నప్పటికీ రాకేష్ కోసం ఈ ఈవెంట్ కి వచ్చాను. ఆ రోజు మాకు సపోర్ట్ చేసిన రాకేష్ కి ఈ వేదిక పైన థాంక్స్ చెప్తున్నాను. తనకి కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ రాస్తానని మాట ఇచ్చాను. తొందరలోనే ఆ క్యారెక్టర్ రాసి రుణం తీర్చుకుంటాను. సినిమా తీసి చూస్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చాలా బావుంది. ఈ సినిమాతో రాకేష్ మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ అంజి గారు మంచి దర్శకులు మంచి కెమెరామెన్. అర్జున్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’ చెప్పారు.
అనసూయ మాట్లాడుతూ… మీడియాకి థాంక్యూ. రాకేష్ నా తమ్ముడు లాంటివాడు. చాలా హానెస్ట్ గా ఈ సినిమా తీశారు. రెండు డబ్బులు సంపాదిస్తే ఇల్లు, కారు కొనుక్కోవాలి అనుకుంటారు. కానీ రాకేష్ మాత్రం ఒక మంచి సినిమా తీయాలనుకున్నాడు, ట్రైలర్ చాలా బాగుంది. చాలా ప్రౌడ్ గా అనిపించింది. అంజి గారు చాలా బ్రిలియంట్ గా ఈ కథని తీశారు. చరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్ అందరికీ ఆల్ ది బెస్ట్. రాకేష్ చాలా హానెస్ట్ గా ఈ సినిమా తీసుకొస్తున్నారు. ఆడియన్స్ కూడా అంతే హానెస్ట్ గా రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్’ అన్నారు.
యాక్టర్ శివబాలాజీ మాట్లాడుతూ… జనరల్ గా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు. ఈమధ్య సినిమా తీసి చూడు కూడా అంటున్నారు. ఈ మూడు చేశాడు రాకేశ్. కంగ్రాజులేషన్స్ రాకేష్. ఈవెంట్ కావడం చాలా ఆనందంగా ఉంది. మూవీ ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, అంతా రాకేష్ కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మా ఆర్టిస్ట్ తరఫున అందరు మూవీని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. అంజి సూపర్ టెక్నీషియన్. షాట్స్ అద్భుతంగా తీస్తాడు. అంజి రాకేష్ కి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చరణ్ శంభో శివ శంభో సినిమాకి లిరిక్స్ రాశాడు. అప్పుడు మేమంతా లేచి క్లాప్స్ కొట్టాం. ఇందులో కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అనన్య చాలా అద్భుతంగా నటించింది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’ అన్నారు.
యాక్టర్ శివారెడ్డి మాట్లాడుతూ.. ఒక మనిషి పట్టుపడితే సాధించకుండా మానడు అనడానికి నిలువెత్తు నిదర్శనం నా తమ్ముడు రాకింగ్ రాకేష్. చాలా కృషి పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాడు. అదే పట్టుదలతో ఈ సినిమా తీశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించి రాకేష్ కి మరిన్ని సినిమాలు చేసే శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. టీం సభ్యులంతా హాజరైన ఈ ట్రైలర్ లాంచ్ వేడుక గా గ్రాండ్ గా జరిగింది.
నటీనటులు: రాకింగ్ రాకేష్, అన్నన్య కృష్ణన్, తనికెళ్ల భరణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత, లోహిత్ కుమార్, బలగం మైమ్ మధు, రచ్చ రవి, కృష్ణ భగవాన్, అంజి, సాయి చరణ్ కిష్టప్ప, జబర్దస్త్ ప్రవీణ్, జబర్దస్త్ నవీన్, జబర్దస్ రాజ్ రాజ్, జబర్దస్త్ జబర్దస్త్ , కీర్తి లత, బలగం తాత, జబర్దస్త్ కర్తానందం
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: విభూది క్రియేషన్స్
స్క్రీన్ ప్లే, రైటింగ్ & ప్రొడ్యూసర్: రాకింగ్ రాకేష్
సినిమాటోగ్రఫీ & దర్శకత్వం: ‘గరుడవేగ’ అంజి
సంగీతం: తెలంగాణ మాస్ట్రో ‘చరణ్ అర్జున్’
ఎడిటర్: మధు
ఆర్ట్ డైరెక్టర్: మహేష్ బల్లంట్
డైలాగ్స్: రాజ్ కుమార్ కుసుమ
చీఫ్ కో-డైరెక్టర్: హేమంత్
కో-డైరెక్టర్: రామారావు, ఉండ్రావట్టి నాగరాజు
మేనేజర్: గణేష్ నాయక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ముదిగొండ సాయికుమార్
పీఆర్వో: వంశీ శేఖర్ (Story : ‘కేసీఆర్’ ట్రైలర్ చాలా బావుంది)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1