శాంతి భద్రతపై ప్రత్యేక దృష్టిని సారిస్తాను
నూతన రూరల్ ఎస్సై శ్రీనివాసులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మండలంలోని గ్రామాలలో శాంతి భద్రతలపై దృష్టిని సారిస్తానని నూతన రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వీరు శనివారం ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఉన్న ఎస్ఐ నరేంద్ర రుద్దం మండలానికి బదిలీపై వెళ్లారు. అప్పటినుంచి ఎస్ఐ పోస్టు ఖాళీగా ఉండడంతో, స్టేషన్లో పలు ఇబ్బందులను ఎదుర్కొనేవారు. దీంతో ఉన్నతాధికారులు గుర్తించి, బత్తలపల్లి లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ శ్రీనివాసులు ధర్మవరం రూరల్ కు ఎస్సైగా బదిలీగా వేశారు. అనంతరం ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాలలో చట్టపరంగా జీవించేలా అన్ని చర్యలు తీసుకుంటానని, చట్టంపై అవగాహన ప్రజలకు కల్పిస్తానని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక శ్రద్ధను ఘనపరుస్తానని, ఫ్యాక్షన్ గ్రామాలపై తప్పక నిఘా ఉంచడం జరుగుతుందని, ఇసుక అక్రమ రవాణా, పేకాట, మట్కా లాంటి సాంఘిక దురాచారాలపై టీమును ఏర్పాటు చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. గ్రామ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని తగు న్యాయం చేకూర్చుతానని తెలిపారు. తదుపరి రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై శ్రీనివాసులకు బొకేలు, పూలమాలలు ఇస్తూ, అభినందన శుభాకాంక్షలు ఘనంగా సత్కరించారు. (Story :శాంతి భద్రతపై ప్రత్యేక దృష్టిని సారిస్తాను)