రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జీవన విధానం
న్యూస్ తెలుగు/వనపర్తి : రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జీవన విధానం భావి తరాలకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం వాల్మీకి జయంతి సందర్బంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐ.డి.ఓ.సీ లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే మేఘా రెడ్డి తో కలిసి మహర్షి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్ప్రవర్తన, సన్మార్గంలో నడవడిక మొదలు పెడితే మహర్షులవుతారని వాల్మీకీ జీవితం ద్వారా తెలుసుకోవచ్చునని అన్నారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ రామాయణ గ్రంథాన్ని రచించిన వాల్మీకి ఆదర్శనీయుడన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, వాల్మీకీ కులస్తులు, ప్రజా సంఘాల నాయకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(Story:రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జీవన విధానం)