తుఫాను ప్రభావం వల్ల తక్షణ సహాయముకై సెల్ నెంబర్ కు సంప్రదించండి
ఆర్డీవో మహేష్
న్యూస్‌తెలుగు/ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షపాతం అధికంగా ఉంటుందని, ఇందులో భాగంగా ధర్మవరం పట్టణము రూరల్ డివిజన్ పరిధిలలో ఏదైనా సహాయ సౌకర్యాలు, ప్రమాదాలు జరిగినచో తాము తెలిపిన సెల్ నెంబర్ కు సంప్రదించాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని 24 గంటల పాటు పని చేస్తుందని తెలిపారు. పట్టణంలో ఏదేని సహాయం కోరదలచినచో సెల్ నెంబర్ 9701811243 కు గాని, 855979326 కు గాని, 7658951274 కు గాని, 8919493957 కు గాని ఫోను చేయవచ్చునని తెలిపారు. అదేవిధంగా ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్డీవో కార్యాలయంలో సెల్ నెంబర్ 98 66057959 కు గాని చేయవచ్చునని తెలిపారు. తదుపరి డివిజన్ పరిధిలోని ఏడు మండలాలను అనగా ధర్మవరం తాసిల్దార్ కార్యాలయంలో సెల్ నెంబర్ 94 90196288 గాని 91 77575971 గాని, బత్తలపల్లి మండలంలో తాసిల్దార్ కార్యాలయం సెల్ నెంబర్ 9963739322 , తాడిమర్రి తాసిల్దార్ కార్యాలయం సెల్ నెంబర్ 9440985339, ముదిగుబ్బ తాసిల్దార్ కార్యాలయం సెల్ నెంబర్ 9866171912, చెన్నై కొత్తపల్లి తాసిల్దార్ కార్యాలయం సెల్ నెంబర్ 9182 065957, రామగిరి తాసిల్దార్ కార్యాలయం సెల్ నెంబర్ 9573423362, కరగానపల్లి తాసిల్దార్ కార్యాలయం సెల్ నెంబర్ 9177869855కు ఫోన్ చేసినచో తక్షణమే సహాయ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని రెవెన్యూ డివిజన్ ప్రజలు గమనించి సహాయమును కోరవలసినదిగా వారు తెలిపారు. (Story : తుఫాను ప్రభావం వల్ల తక్షణ సహాయముకై సెల్ నెంబర్ కు సంప్రదించండి)