19న ములుగుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : 19న ములుగు జిల్లా కు మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, 5 గురు కమిటీ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ బుధవారం ములుగు జిల్లాకు విచ్చేయుచున్నారని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కలేక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ల్యాండ్స్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమావేశం నిర్వహించబడునని, ఇట్టి సమావేశమునకు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కమిటీ సభ్యులు మరియు జిల్లా అధికారులు, జిల్లాలోని తహసిల్దార్లు, ఎంపీడీవో లు హాజరుకావలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. (Story : 19న ములుగుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక)