సబ్ జైలు ను ఆకస్మికంగా తనిఖీ
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని సబ్ జైలును ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ జైల్లో సౌకర్యాలపై వారు ఆరాధించారు. అనంతరం సబ్ జైల్లో ఉన్నటువంటి రిజిస్టర్ లను కూడా వారు పరిశీలించారు. తదుపరి సబ్ జైల్లో ఉన్న ఖైదీలతో వారు నేరుగా మాట్లాడారు. ఖైదీలుగా మీకు జైల్లో వసతులు సరిగా ఉన్నాయా లేదా అన్న వాటిని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తెలుపవచ్చునని వారు తెలిపారు. ఎవరికైనా న్యాయవాదులు లేకుంటే వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఖైదీలుగా మీరు సత్ప్రవర్తనతో మెలగాలని తెలిపారు. తొలుత ఖైదీలు ఉన్నటువంటి గదులను, వంటగదిని, స్టోర్ గదిని కూడా తనిఖీ చేశారు. ఖైదీలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేటట్లు చర్యలు చేపట్టాలని జైలు సూపర్డెంట్ ను వారు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపర్డెంట్ బ్రహ్మిరెడ్డి, న్యాయవాది నూర్ మొహమ్మద్, సబ్ జైలు సిబ్బంది పాల్గొన్నారు.(Story:సబ్ జైలు ను ఆకస్మికంగా తనిఖీ )