ఘనంగా అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
న్యూస్ తెలుగు /ధర్మవరం : స్థానిక రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల మధ్య కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విద్యార్థుల కోసం, వారి భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం ఆయన చేసిన కృషికి నివాళిగా ఆయన జయంతిని అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం గా జరుపుకుంటామని ఆయన తెలిపారు.డైరెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి మరియు కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాం తన జీవితాంతం వరకు విద్యార్థుల ఉన్నతి కొరకు వారి భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దాలని అనిర్వచనీయ కృషిని చేశారని వారు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త అందరికీ ఆదర్శప్రాయుడని, అబ్దుల్ కలాం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. నిరాడంబరుడు, నిఘర్వి, బాలల మనసుతో కలిగిన భారతీయ శాస్త్రవేత్త ప్రపంచపు గుర్తింపు పొందిన గొప్ప నాయకుడు అబ్దుల్ కలాం అని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఏవో రమేష్, అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : ఘనంగా అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం)