ముగిసిన శరణవ రాత్రి మహోత్సవ వేడుకలు
ఆర్యవైశ్య సంఘం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని కెపిటి వీధిలో గల వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం, ఆలయ కమిటీ, వాసవి మహిళా మండలి, ఆర్యవైశ్య యువజన సంఘం తదితర అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలను ఈనెల మూడవ తేదీ నుండి 15వ తేదీ వరకు 13 రోజులు పాటు నిర్వహించారు. పది రోజులుగా అమ్మవారు వివిధ అలంకరణ రూపాలలో భక్తాదులకు దర్శనమిచ్చారు. చివరి రోజు మంగళవారం వాసవి మాతకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అర్చకులు నారాయణమూర్తి, చంద్రశేఖర శర్మ అమ్మవారిని వివిధ పూలలతో అలంకరించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. తదుపరి అమ్మవారికి వివిధ అభిషేకాలతో పాటు సంప్రోక్షణ కార్యక్రమం కూడా ఆర్యవైశ్యులు, భక్తాదులు, దాతల నడుమ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని అధ్యక్షురాలు పోడమల రూపరాగిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్య వైశ్యులు, ఆర్యవైశ్య సంఘం, ఆలయ కమిటీ, అనుబంధ సంస్థలు పాల్గొన్నారు. (Story : ముగిసిన శరణవ రాత్రి మహోత్సవ వేడుకలు)