సిబ్బంది సమస్యల పరిష్కారంకై ప్రత్యేక విభాగం
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
న్యూస్ తెలుగు /వరంగల్, ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య) : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ తెలిపారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న, పోలీస్ సిబ్బంది పలు వ్యక్తిగత సమస్యలతో పాటు, శాఖపరమైన సమస్యలతో బాధపడుతున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ దృష్టి రావడంతో, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకోని, వారి సమస్యలను పరిష్కరించేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములోని పోలీస్ కంట్రోల్ రూంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ ఇందుకోసం కంట్రోల్ రూంకు చెందిన మహిళా ఏఎస్‌ఐ జ్యోతి ప్రియాంకను నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని, ఇకపై పోలీస్ సిబ్బంది తమ వ్యక్తిగతం కాని శాఖపరమైన సమస్యలు వుంటే నోడల్ అధికారి ఫోన్ నంబర్ 9948685494 ఫోన్ ద్వారా తమ ఫిర్యాదులు, సమస్యలను తెలియజేయాల్సి వుంటుందని పేర్కొన్నారు.ఈ విధంగా వచ్చిన ఫిర్యాదులను సదరు నోడల్ అధికారి పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకవెళ్ళి సమస్య పరిష్కారం కొరకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ముఖ్యంగా సిబ్బంది తమ వ్యక్తిగత సమస్యలు, శాఖపరమైన సమస్యలు పోలీస్ కమిషనర్ ప్రత్యక్షంగా కలుసుకోని తెలియజేసేందుగాను, ఇకపై పోలీస్ సిబ్బంది కేవలం ప్రతి శనివారం రోజున మాత్రమే పోలీస్ కమిషనరేట్ సిబ్బంది రావల్సి వుంటుందని వివరించారు. అలాగే పోలీస్ కమిషనర్ కలిసేందుకు, వచ్చే సిబ్బందికి స్టేషన్ అధికారులు తప్పని సరిగా, అనుమతి మంజూరు చేయాల్సిందని,వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు ఉత్తర్వులు జారీచేసారు. (Story : సిబ్బంది సమస్యల పరిష్కారంకై ప్రత్యేక విభాగం)