పల్లె పండుగ కార్యక్రమంలో ఎటువంటి సమస్యలు లేకుండా శంకుస్థాపనలు చేయాలి
న్యూస్ తెలుగు/ సాలూరు : పల్లె పండుగ కార్యక్రమంలో గ్రామాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా శంకుస్థాపనలు చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా అధికారులకు రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం ఇంటి వద్ద ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతున్న పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో శంకుస్థాపనలు ఎటువంటి సమస్యలు లేకుండా కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, వెంటనే పనులు ప్రారంభం చేయాలని జిల్లాలో గల అధికారులకు మంత్రి సంధ్యారాణి సూచనలు చేసారు. (Story :పల్లె పండుగ కార్యక్రమంలో ఎటువంటి సమస్యలు లేకుండా శంకుస్థాపనలు చేయాలి)