Home వార్తలు తెలంగాణ జిల్లాకు చేరిన సీఎం కప్ క్రీడాజ్యోతి

జిల్లాకు చేరిన సీఎం కప్ క్రీడాజ్యోతి

0

జిల్లాకు చేరిన సీఎం కప్ క్రీడాజ్యోతి

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నవంబర్ లో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. సీఎం కప్ క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడాజ్యోతి ర్యాలీ సోమవారం ములుగు కు చేరుకుంది. క్రీడాజ్యోతి ర్యాలీకి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద తెలంగాణ
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.ఘన స్వాగతం పలికారు. అనంతరం జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు. ఈ సందర్బంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, మాట్లాడుతూ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం త్వరలో జరగబోయే సీఎం కప్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ క్రీడాకారులు పాల్గొనే విధంగా అవగాహన కల్పించడమే ముఖ్య లక్షమని అన్నారు. గ్రామీణ స్థాయి నుండి యువత పెద్ద ఎత్తున సీఎం కప్ క్రీడలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ అద్భుత అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు పరిపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని అన్నారు. మన జిల్లా నుండి ప్రపంచ స్థాయిలో రాణించే విధంగా క్రీడాకారులు తయారు కావాలని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు.
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు అట్టహాసంగా సుమారు 500 మంది క్రీడా భిమానులతో క్రీడాజ్యోతి ర్యాలీ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు సాగింది.
ములుగు లో ర్యాలీ అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బయలుదేరి వెళ్లిన క్రీడాకారుల
టార్చ్ ర్యాలీ.
అంతకుముందు ములుగు మండలం ఇంచెర్ల గ్రామం ఎర్రి గట్టమ్మ వద్ద స్పోర్స్ స్కూల్ ఏర్పాటుకు అనువైన 38 ఎకరాల స్థలాన్ని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. తొ కలసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, యువజన క్రీడల అధికారి తుల రవి, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది, క్రీడాకారులు, యువతి, యువకులు, విద్యార్థి, విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు. (Story : జిల్లాకు చేరిన సీఎం కప్ క్రీడాజ్యోతి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version