ఉపాధి హామీ పనులు గ్రామాలకు వరం లాంటివి
ఎంపీడీవో సాయి మనోహర్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఉపాధి హామీ గ్రామ ప్రజలకు వరం లాంటిదని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని గొట్లూరు,చిగిచెర్ల, సుబ్బారావు పేట మరియు తుమ్మల పంచాయతీల్లో పల్లె పండుగ కార్యక్రమంను వారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 24 లక్షల రూపాయలతో ఈ ఉపాధి హామీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం నందు ముఖ్యంగా ఉపాధిహామీ నిధుల ద్వారా చేపడుతున్న పండ్లతోటల పెంపకం, సిసి రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్లు, సాగునీటి కాలువల పునరుద్దరణ, వాన నీటి సంరక్షణ కోసం ప్రభుత్వ కార్యాలయసముదాయాల్లో రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులను చేపట్టి, తద్వారా గ్రామాల్లోని ప్రజల యొక్క ఆర్ధిక,సామాజిక స్థితిని మెరుగు పరచడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరంగా, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి, పల్లెల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యమని వారు తెలిపారు. చిగిచెర్ల గ్రామంలో అక్కడ నాగలక్ష్మి పొలం నందు మామిడి మొక్కలను నాటి ఇలాంటి పనులను విరివిగా చేపట్టాలని తెలిపారు. అలాగే ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి గొట్లూరు నందు పాల్గొని, ఇక్కడ రామకృష్ణ పొలం నందు చీనీ మొక్కలను నాటారు. అలాగే పంట కాల్వ పూడిక తీయు పనిని కూడా ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏపీవో అనిల్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ ఓపిరెడ్డి, టిఏలు- చంద్రకళ, నాగేంద్ర, భారతి, లక్ష్మినారాయణ ఎఫ్ ఏ లు, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. (Story : ఉపాధి హామీ పనులు గ్రామాలకు వరం లాంటివి)