ఘనంగా విజయదశమి వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ :జయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలో మనుషులు – మానవత్వం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్ మరియు విశ్రాంత ఉపాధ్యాయులు భాగవతుల రవికుమార్ లు వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రోజురోజుకీ మానవ సంబంధాలు కూచించుకొని పోతున్నాయని, డబ్బే ప్రధానంగా ఉంటుందని ఆవేదన వెలిబుచ్చారు. గుమ్మడి వృద్ధాశ్రమంలో వృద్ధుల ఆలనా పాలన చూస్తుంటే ఇంకా మానవత్వం మిగిలి ఉందని అనిపిస్తుందని అన్నారు. ఆశ్రమ నిర్వాహకులు మంచి మనసు మానవత్వం కలిగిన గుమ్మడి వెంకటేశ్వర్లు ను అభినందించారు. అనంతరం విశ్వ సాయి జూనియర్ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస శర్మ, స్టాంప్ రైటర్ ముప్పాళ్ళ మల్లికార్జునరావు, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు భాగవతుల రవికుమార్, ప్రముఖ లాయర్ భావన రామ్మోహన్రావు, సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్, ప్రముఖ రంగస్థల కళాకారులు బండ్లమూడి సుబ్బారావు ఆశ్రమంలో సేవలు చేస్తున్న మునెమ్మ, సామ్రాజ్యం, కొండలు, బ్రహ్మయ్య, సరస్వతి లను దుశ్యాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. (Story : ఘనంగా విజయదశమి వేడుకలు)

