ప్రసిద్ధ కవి కరీముల్లాకు ప్రొద్దుటూరులో ఘన సత్కారం
న్యూస్ తెలుగు /వినుకొండ : పట్టణానికి చెందిన ప్రసిద్ధ కవి కరీముల్లాకు ప్రొద్దుటూరులో ఘన సత్కారం జరిగింది. ప్రతిష్ఠాత్మక ఏపిజె.అబ్దుల్ కలాం అవార్డు అందజేసి వక్తలు కొనియాడారు. తెలుగు సాహిత్యంలో కరీముల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని,ఆయన సృష్టించిన అబాబీలు కవితా ప్రక్రియ మహోన్నతంగా ఈ తరం కవులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. తెలుగు భాషకు సరికొత్త సొగసులద్దిన కరీముల్లా కవిత్వం నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో అనువాదమై ఎంతో పేరు తెచ్చిందని తెలిపారు..మన కాలం జాషువాగా కరీముల్లా ఖ్యాతి నొందటం అందరికీ గర్వకారణమని కొనియాడారు. కార్యక్రమంలో రిటైర్డ్ డియస్పి మహబూబ్ బాషా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.సిద్దయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారం బాజి, లాల్ వజీర్, వేంపల్లీ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రసిద్ధ కవి కరీముల్లాకు ప్రొద్దుటూరులో ఘన సత్కారం)