అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శరణ్య రాత్రుల మహోత్సవ వేడుకలు ఈవో వెంకటేశులు, భక్తాదులు, అర్చకులు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారు 10వ రోజున గ్రామోత్సవ అలంకరణలో భక్తాదులకు దర్శనమిచ్చారు. శాశ్వత వంశపారంపర్య ఉభయ దాతలు జగ్గా వంశీయులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.
పట్టణంలోని దుర్గమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు ఆలయ ఈవో వెంకటేశులు, భక్తాదులు నడుమ అంగరంగ వైభవంగా జరిగాయి. 10వ రోజున అమ్మవారు విజయ దుర్గ దేవి అలంకరణ గావించి, భక్తతులకు దర్శనమిచ్చారు
పట్టణములోని శ్రీనివాస నగర్ (గుడ్డి బావి వీధిలో) గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయములో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవ వేడుకలో 10వ రోజు విశ్వరూప అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, చెన్నం శెట్టి రమేష్ కుమార్, జింక రాజేంద్రప్రసాద్, చెన్నం శెట్టి శ్రీనివాసులు, అర్చకులు రాజేష్ ఆచార్యులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. (Story : అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు)