పల్లె పండుగను విజయవంతం చేయండి
ఎంపీడీవో ఎస్. సాయి మనోహర్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పంచాయతీరాజ్ కమిషనర్ గ్రామీణ అభివృద్ధి గుంటూరు వారి ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ జాతీయ పథకం, 15వ ఆర్థిక సంఘం నిధుల, సాధారణ నిధుల కింద గ్రామసభలలో ఆమోదం పొందిన పనులను దసరా పండుగలుగా అనగా అక్టోబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు పనులకు భూమి పూజ ను పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించడం జరుగుతుందని ఎంపీడీవో ఎస్. సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల పరిధిలోని 20 20 గ్రామ పంచాయతీలలో గొట్ట్లూరు-1 లో ఉదయం 10 గంటలకు ఎంపీడీవో సాయి మనోహర్ మండల అధికారిగా, అదేవిధంగా ఈనెల 15వ తేదీన సీసీ కొత్తకోట ఉదయం 10 గంటలకు, పోతుల నాగేపల్లి లో మధ్యాహ్నం రెండు గంటలకు, చిగీచెర్ల లో 10 గంటలకు, చింతలపల్లి లో రెండు గంటలకు, ఉప్పు నేసిన పల్లి లో 10 గంటలకు, దర్శనమల 10 గంటలకు, వెంకట తిమ్మాపురం లో రెండు గంటలకు, ధర్మపురి (సి. బత్తలపల్లి) లో 10 గంటలకు, రావులచెరువు గ్రామ పంచాయతీ పదలో మధ్యాహ్నం రెండు గంటలకు, 16వ తేదీన ఏలకుంట్లలో 10 గంటలకు, నేలకోటలో మధ్యాహ్నం రెండు గంటలకు, నేలకోట తండాలో సాయంత్రం నాలుగు గంటలకు, కునూతురు లో ఉదయం 10 గంటలకు, పోతుకుంట లో మధ్యాహ్నం రెండు గంటలకు, మల్కాపురం ఉదయం 10 గంటలకు, మల్లా కాలువలో మధ్యాహ్నం రెండు గంటలకు, రేగాటిపల్లి లో ఉదయం పదిగంటలకు, తుమ్మల లో ఉదయం 10 గంటలకు, సుబ్బారావు పేట లో మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీలలో మండల అధికారి హోదాలో సాయి మనోహర్, వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, రఘునందన్ రెడ్డి, గోపాల్ నాయక్ నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్, హిందూపురం పార్లమెంటు సభ్యులు బి.కె పార్థసారథి హాజరు అవుతారని తెలిపారు. కావున ధర్మవరం మండల అధ్యక్షులు, జిల్లా ప్రాదేశిక సభ్యులు, మండల ప్రాదేశిక సభ్యులు, సర్పంచులు, వార్డు సభ్యులు, ఇతర నాయకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. (Story : పల్లె పండుగను విజయవంతం చేయండి)