600 మంది బాల కన్యలతో కుంకుమ పూజ
న్యూస్ తెలుగు / వినుకొండ : శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవంలో భాగంగా ఏడవ రోజు బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 20 లక్షల రూపాయలు డబ్బులతో లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు అనుగ్రహిస్తున్నది మరియు కనుగండ్ల అనంతరామ కోటేశ్వరరావు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఉదయం 7 గంటలకు 54 జిలకర సములతో నగరోత్సవము, జగద్గురు పీఠం వినుకొండ వారిచే వేద పట్టణం తదుపరి వెయ్యి మంది మహిళలచే లక్ష కుంకుమార్చన, అనంతరం దంపతులచే కుంకుమ పూజలు, తీర్థ ప్రసాద వినియోగము, మంగళహారతి సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ గణపతి శ్రీ మహా చండీ హోమం దంపతులచే నిర్వహించారు. కుమారి పూజ, సువాసిని పూజ హోమంలో కూర్చున్న దంపతులకు వేద ఆశీర్వచనము, శేష వస్త్రం, తీర్థ ప్రసాద వినియోగం రాత్రి 8 గంటలకు అమ్మవారికి నవరాత్రులలో విశేషంగా ప్రాధాన్యమిస్తూ అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు.
రాత్రి 10 గంటలకు విశేషంగా అమ్మవారికి నవ హారతులు ఇవ్వడం జరిగినది. అనంతరం మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగంవినుకొండ పట్టణంలోని ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు సుఖశాంతులతో, పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో తులతూగవలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి దేవి శరన్నవరాత్రులు వినుకొండ పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆర్థిక సహాయ సహకారములతో అత్యంత వైభవముగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అ భక్తులందరూ వేలాదిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం వినుకొండ పాలక మండల సభ్యులు
బిత్తింటి కృష్ణ ఆంజనేయులు, నేరెళ్ల వెంకట పాపారావు, పెనుగొండ రమేషు, పెండేలా శ్రీనివాసరావు, కన్నెగండ్ల అనంత కోటేశ్వరరావు , కోట వెంకట ప్రకాష్ బాబు పాల్గొన్నారు.(Story:600 మంది బాల కన్యలతో కుంకుమ పూజ)