Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం

వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం

0

వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :  పట్టణంలోని కెపిటివీధిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆరవ రోజున అమ్మవారు సాయంత్రం వాసవి మాత అలంకరణ లో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరి రమణయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ గుప్తా కార్యదర్శి తబ్జుల శ్రీనివాసులు , ఆలయ కమిటీ చైర్మన్ పిన్ను శ్రీనివాస ప్రసాద్ తో పాటు అనుబంధ సంఘం ఆర్యవైశ్యులు, భక్తాదులో పాల్గొన్నారు. పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బంధనాథం వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ ,కోశాధికారి వెంకటేశులు, (చిట్టి) తదితర సభ్యుల ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల 41 వ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆరవ రోజున అమ్మవారు లలితా దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. పట్టణంలోని లక్ష్మీ నగర్- రాజేంద్రనగర్ లో గల శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆరవ రోజున అమ్మవారు మధుర మీనాక్షి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. (Story : వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version