Home వార్తలు తెలంగాణ అసంక్రమిత వ్యాధులపై అవగాహన సదస్సు : డియంహెచ్ఓ

అసంక్రమిత వ్యాధులపై అవగాహన సదస్సు : డియంహెచ్ఓ

0

అసంక్రమిత వ్యాధులపై అవగాహన సదస్సు : డియంహెచ్ఓ

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆదేశానుసారం మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ములుగు కార్యాలయంలోని మీటింగ్ హాల్లో అసంక్రమిత వ్యాధులపై రి ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి అప్పయ్య హాజరై మాట్లాడుతూ రక్తపోటు మధుమేహము, క్యాన్సర్ 30 సంవత్సరాలు ఉన్న అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, రక్తపోటు మధుమేహం క్యాన్సర్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈనాటి శిక్షణ కార్యక్రమానికి,డబ్ల్యూ హెచ్ ఓ నుండి వచ్చిన డాక్టర్ సత్యేంద్రనాథ్ మాట్లాడుతూ ,30 సంవత్సరములు పైబడిన వారందరికి రక్త పోటు, మధుమేహము, క్యాన్సర్ కు సంబంధించిన వాటి పరీక్షలు నిర్వహించి,,ఆ యొక్క వివరములు అన్నింటిని ఎన్సిడి ఆన్లైన్ , ఆయుష్మాన్ భారత్ పోర్టల్ లో పొందుపరిచే పద్ధతిని సవివరంగా శిక్షణ ఇచ్చారు. రోగ నిర్ధారణ అయినా వారందరికీ మధుమేహము, రక్తపోటు, క్యాన్సర్ కు , మందుల పంపిణీ మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు చేసి , ఆ మందులను క్రమ పద్ధతిలో వాడేలా ప్రోత్సహించాలని సిబ్బందికి తెలిపారు.
అనుమానిత క్యాన్సర్ రోగులను నిర్ధారణ కొరకు చికిత్స కొరకు రిఫరల్ సెంటర్స్ కి ఆలస్యం చేయకుండా పంపించాలని, తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా జరగబోయే నష్టాన్ని కొంతవరకు మనం తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విపిన్ , అసంక్రమిక వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ పవన్ కుమార్ ,జిల్లా పిల్లల ఆరోగ్యము ఇమినైజేషన్ అధికారి డాక్టర్ రణధీర్, కీటక జనిత టిబి నియంత్రణ అధికారి డాక్టర్ భవ్య శ్రీ, డిప్యూటీ మాస్ మీడియా అధికారి సంపత్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్స్ , మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (పల్లె దవఖానయం ఎల్ హెచ్ పి ), ఫార్మసిస్టులు ,డిడిఎం, డిపిఓ మహిళా ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : అసంక్రమిత వ్యాధులపై అవగాహన సదస్సు : డియంహెచ్ఓ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version