విదేశీ మారకపు సేవలకు ఉజ్జీవన్ బ్యాంక్ కు ఆర్బీఐ అనుమతి
న్యూస్ తెలుగు/ బెంగళూరు: ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, తన ప్రస్తుత ఏడీ 2 లైసెన్స్ కింద పరిమిత ఉత్పాదనల స్థానంలో పూర్తి స్థాయి ఫారెక్స్ ఉత్పాదనలు, సేవలను అందించ డానికి ఆర్బీఐ నుండి ఏడీ 1 లైసెన్స్‌ను పొందింది. ఈ లైసెన్స్‌తో రిటైల్ బ్యాంకింగ్, ఎంఎస్ఎంఈ /ట్రేడ్ ఫైనాన్స్, ట్రెజరీ బిజినెస్ కింద వివిధ ఫారెక్స్ సేవలను కవర్ చేస్తూ భారతదేశం, విదేశాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మా విస్తృత శ్రేణి కస్టమర్లకు విదేశీ మారకపు మార్కెట్‌లో ఉజ్జీవన్ ఇప్పుడు ఫారెక్స్ లావాదేవీల (విదేశీ కరెన్సీలలో కొనుగోలు/ అమ్మడం/రుణం తీసుకోవడం) సమగ్ర శ్రేణిని సులభతరం చేయగలదు. రిటైల్ బ్యాంకింగ్ కింద ఈ ఉత్పాదనలు చెల్లింపులు, ఎఫ్‌సీఎన్ఆర్/ఆర్ఎఫ్‌సీ కింద డిపాజిట్లు తీసుకోవడం, ఫారెక్స్ కార్డ్‌లు, కరెన్సీ ఎక్స్ఛేంజీలు, ఈసీబీ, ఓడీఐ, ఎఫ్‌డీఐ మొదలైన మూలధన ఆధారిత లావాదేవీలను కలిగి ఉంటాయి. ఎక్స్ఛేంజ్ ఎర్నర్స్ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ (ఈఈఎఫ్‌సీ), ప్రి అండ్ పోస్ట్ షిప్ మెంట్ ఫండింగ్ తో సహా ఎక్స్ పోర్ట్ – ఇంపోర్ట్ ఫైనాన్స్, కస్టమర్ల తరపున వాణిజ్య సంబంధిత చెల్లింపులను చేపట్టడం, ఎఫ్‌సీలో బిల్స్ డిస్కౌంటింగ్, లెటర్ ఆఫ్ క్రెడిట్స్ (ఎల్‌సీ), బ్యాంక్ గ్యారెంటీలు (బీజీ) మొదలైన ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ వంటి అంతర్జాతీయ వాణిజ్య సంబంధిత కార్యకలాపాలను అందించడానికి కూడా ఈ లైసెన్స్ వీలు కల్పిస్తుంది. (Story : విదేశీ మారకపు సేవలకు ఉజ్జీవన్ బ్యాంక్ కు ఆర్బీఐ అనుమతి)