పాఠశాలలలో తాగునీటి సమస్యను పరిష్కరించారా..?
చాట్రాయి ఎంపీపీ లంక నిర్మల
జనరల్ బాడీ సమావేశంలో కొత్తదనం చూపించిన ఇన్చార్జ్ ఎంపీడీవో
న్యూస్ తెలుగు/ చాట్రాయి : చాట్రాయి సర్వసభ్య సమావేశంలో అనేక ఆసక్తికరమైన పరిణామాలకు అద్దం పట్టింది. సోమవారం మధ్యాహ్నం లంక నిర్మల అధ్యక్షతన జరిగిన చాట్రాయి మండల సర్వసభ్య సమావేశం అద్దం పట్టింది. ఎంపీపీ లంక నిర్మల సమావేశం ప్రారంభం నుంచే ప్రజా సమస్యలను ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల తాగునీటి సమస్యను వస్తావించడం పై ఎంఇఓ సింఫుల్ గా తీసుకున్నప్పటికీ ఇన్చార్జి ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న జి రాణి సమస్యకు ఉన్న ప్రాధాన్యతపై లోతైన సమీక్ష చేయడం కొత్తదానానికి నాంది పలికింది.ఎంఇఓ బ్రహ్మచారి విద్యా రంగం గురించి వివరిస్తుండగా ఎంపీపీ ప్రశ్నిస్తూ గత సమావేశంలో మండలంలోని అనేక పాఠశాలలలో నాడు నేడు లో తాగునీటితో సౌకర్యం కోసం నిర్మించిన వాటర్ ప్లాంట్లు మరమత్తులు గురించి మాట్లాడాం సభ్యులు అనేక ప్రశ్నలు వేశారు. వాటి సంగతి ఏమయింది…? మరమ్మత్తులు చేయించారా లేదా…? అని ప్రశ్నించగా ఎంఈఓ చాలా ఈజీగా తీసుకోవడంతో ఎంపీడీవో జోక్యం చేసుకుని చిన్నపిల్లల విషయంలో నిర్లక్ష్యం వద్దని మీరు లేకపోతే డయేరియా వచ్చే ప్రమాదం ఉందని సమస్య యొక్క తీవ్రతను తెలియజేస్తూ జిల్లా అధికారులకు తాను ఫిర్యాదు చేస్తానన్నారు. నిధులు ఉన్నా లేకపోయినా సమస్యను పై అధికారులకు తెలియజేయడం కనీస బాధ్యత అన్నారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సుబ్బారెడ్డి కూడా తాగు నీటి సమస్యను ప్రశ్నించారు.
ఉర్దూ పాఠశాలలో ఉర్దూ టీచరే లేరు..?
మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ. మండలంలోని తుమ్మగూడెం గ్రామంలో ఉన్న ఉర్దూ పాఠశాలలో ఉర్దూ టీచర్ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పశు వైద్య శాఖ అధికారి మాట్లాడుతుండగా .కృష్ణా రావు పాలెం ఎంపీటీసీ జోక్యం చేసుకుని మండలంలో పశు వైద్య శాఖలో ఉండాల్సిన డాక్టర్లు ఎంతమంది ఎంతమంది ఉన్నారంటూ ప్రశ్నించారు. అర్హత కలిగిన పశు వైద్యులను నియమించాలని కోరారు. ఎన్ ఆర్ ఇజిఎస్ ఏపీవో మాట్లాడుతుండగా. కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతకుంట్ల వెంకటేశ్వరరావు జనార్ధన వరం ఎంపిటిసి కృష్ణ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఐసి డి ఎస్ అధికారిని మాట్లాడుతుండగా జనార్ధనవరం ఎంపీటీసీ కృష్ణ మాట్లాడుతూ . ఎస్సీ కాలనీలో ఐసిడిఎస్ భవనం నిర్మాణంలో జాప్యం వలన చిన్న చిన్న పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధుల ప్రశ్నలపై ఎంపీడీవో గతంలో ఎన్నడూ లేని విధంగా సావధానంగా సమాధానాలు ఇచ్చి మెప్పించారు.
22 శాఖలకు 10 శాఖల అధికారులు హాజరయ్యారు చాట్రాయి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో 22 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ మొదట ఏడు శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. మరికొద్ది సమయం తర్వాత మరో మూడు శాఖల వారి హాజరయ్యారు.12 శాఖల వారు హాజరు కాని పరిస్తితి. సమావేశంలో జడ్పిటిసి చెలికాని అనూష మండల వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ విజయలక్ష్మి ఎలక్ట్రికల్ ఏ ఈ సంజయ్ తదితరులు హజరైయ్యారు. (Story : పాఠశాలలలో తాగునీటి సమస్యను పరిష్కరించారా..?)