దుర్గమ్మ సేవలో మంత్రి సంధ్యారాణి
న్యూస్ తెలుగు/సాలూరు : విజయవాడ కనక దుర్గమ్మ సేవలో మంత్రి సంధ్యారాణి
దసరా శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబసమేతంగా రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి దర్శించుకున్నారు. ఆమెకుఆలయ అధికారులు ఆలయ సంప్రదాయం అనుసరించి పూజలు జరిపి అర్చకులు ఆశీర్వచనంతో పాటు తీర్ధ ప్రసాదాలు ఇచ్చి అమ్మవారి ఫోటోతో సత్కరించారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆమె కోరుకున్నారు.(Story: దుర్గమ్మ సేవలో మంత్రి సంధ్యారాణి)