అమరజీవి లక్ష్మి దేవమ్మకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు / వనపర్తి : ఇటీవలే మృతి చెందిన సిపిఎం సీనియర్ నాయకురాలు కామ్రేడ్ లక్ష్మీదేవమ్మకి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి నివాళులు అర్పించారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని కళ్యాణ్ సాయి మండపంలో ఏర్పాటు చేసిన పాల్గొన్న ఆయన అమరజీవి లక్ష్మీదేవమ్మ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. పార్టీ అభ్యున్నతికి లక్ష్మీదేవి అమ్మ చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జూబ్బర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు (Story : అమరజీవి లక్ష్మి దేవమ్మకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే)