బీసీ కులగణన చేయాలనీ విజయవాడ లో జరిగే మహాధర్నా విజయవంతం చేయండి
బీఎస్పీ పార్టీ ఇంచార్జి సాకే వినయ్ కుమార్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : విజయవాడ లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో లో ఈ నెల 9న నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలనీ, ధర్నా కి సంబందించిన కరపత్రం లను విడుదల చేయడం జరిగిందని ధర్మవరం బిఎస్పి ఇంచార్జి సాకే వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ మాట్లాడుతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలు జాతీయ స్థాయిలో కులగణన నిర్వహించి, బీసీ ల కులగణన నిర్వహించి జనాభానూ బట్టి పార్లమెంట్, అసెంబ్లీ లో సీట్లు ఇవ్వాలి అలాగే స్థానిక సంస్థ ఎన్నికలో కూడా కులాల దమాషా ప్రకారం సీట్లు కేటాయించాలి అని, రాష్ట్ర స్థాయిలో కులగన ద్వారానే బీసీ లో ప్రమోషన్ లో రిజర్వేషన్ ఇచ్చి బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకోనిరావాలి, బీసీ ల జనాభా ఎంతో తెల్చాలని, భారతదేశం 1931 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం లెక్కించిన కులాల వరి జనాభా తరువాత ఇంతవరకు కులగనన భారత ప్రభుత్వం నిర్వహించలేదు బ్రిటిష్ ప్రభుత్వం ముస్లీమ్, సిక్కు మైనారిటీ లతో బాటు నిమ్మ కులాలవరికి కూడా కులజనగణ బట్టి చట్టసభలో రాజకీయ ప్రతినిత్యం కల్పించింది అని తెలిపారు.బీసీల కుల జనగణన” చేయాలని చేస్తున్న డిమాండ్ ను పక్క దోవ పట్టించే కుట్రే తప్ప మరొకటి కాదు అని, నైపుణ్య గణన కూడా ఈ కుట్రలో భాగమేనని తెలిపారు.
నైపుణ్య గణన చేసి “ఆదరణ పథకము” ద్వారా పనిముట్లు ఇస్తాం, మీ మీ వృత్తి పనులు మీరు చేసుకోండి, మాకు మాత్రం ఓట్లు వేయండనే తరహాలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకొంటుంది అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సోదరులకు కల్పించిన రక్షణ చట్టం మాదిరిగానే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని ఈ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పడం జరిగింది అని, మరి బీసీల మీద ఎనలేని ప్రేమే ఉంటే, అధికారం చేపట్టిన మొదటి మంత్రిమండలి సమావేశంలోనే ఒక రూపాయి కూడా ఖర్చు కాని ఈ చట్టాన్ని తేవాల్సి ఉంది అని తెలిపారు. మరి ఎందుకు ఇంత వరకు తేలేదు అని వారు ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఉన్న 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గి దాదాపు 16,200 పదవులు పోవడానికి చంద్రబాబు ప్రధాన కారకుడు అని, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి 2013 జులైలో 34 శాతం ప్రకారం సర్పంచ్ ఎన్నికలు జరపడం జరిగిందన్నారు. వీరి ఐదు సంవత్సరాల కాలం 2018 జూలైలో ముగయగా, 2018లో సిఎంగా ఉన్న చంద్రబాబు గారు జరపాల్సి ఉండేదని, కాని ఈ 34 శాతంపై కోర్టుకు వెళ్లడం వల్ల ఎన్నికలు జరపలేద అని తెలిపారు. తరువాత అధికారం మారి సిఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి కోర్టు 24 శాతానికి తగ్గించి ఎన్నికలు జరిపారు అని తెలిపారు. ఆ సందర్భంలో కోర్టుకు పోయిన జగన్ మోహన్ రెడ్డి దిగిన ఫోటోను వివిధ దినపత్రికల్లో వేయడం జరిగిందన్నారు జగన్ ఫోటో దిగిన అదే రెడ్డి చంద్రబాబుతో దిగిన ఫోటోను మరో పత్రికలో వేసి చంద్రబాబే కోర్టుకు పంపారని రాశారు అని తెలిపారు. ఈ విధంగా ఒకరిమీద ఒకరు వేసుకొని బీసీలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. నిజానికి చంద్రబాబు 2018 జూలైలోనే ఎన్నికలు జరిపి ఉంటే ఇంతటి తీరని అన్యాయం బీసీలకు జరిగి ఉండేది కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు బీసీల మీద ప్రేమే ఉంటే “బీసీల కుల జనగణన” చేసి, బీసీల జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీఎస్పీ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బహు సమాజ్ పార్టీ నాయకులు హరికుమార్, విజయ్, కళ్యాణి నాగభూషణ, రైతు సంఘం రామకృష్ణ, మంజుల నరేంద్ర, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. (Story : బీసీ కులగణన చేయాలనీ విజయవాడ లో జరిగే మహాధర్నా విజయవంతం చేయండి )