Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ఉపాధ్యాయులకు శుభవార్త

కాబోయే ఉపాధ్యాయులకు శుభవార్త

0

కాబోయే ఉపాధ్యాయులకు శుభవార్త

ఎయిడెడ్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు

కాకినాడ, రాజమండ్రిలో ఖాళీల ప్రకటన

ఎస్‌ఐఎంసీ వెబ్‌సైట్‌లో వివరాలు

న్యూస్‌ తెలుగు/అమరావతి : ‘మీరు..ఇప్పటికే ఉపాధ్యాయ వృత్తి కోర్సులు పూర్తిచేసి, ఏపీ టెట్‌/సీటెట్‌లో అర్హత సాధించారా?..ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారా..?’ అయితే ఇది మీ కోసమే. మీ ముగింటకు మంచి అవకాశం వచ్చింది..కాబోయే ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఆ మేరకు శాఖ ఈ నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. దీంతో ఎయిడెడ్‌ పాఠశాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రకటనలు జారీచేసి, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆయా ప్రాంతీయ, జిల్లా అధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. స్కూల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎస్‌ఐఎంసీ) వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియలను ప్రారంభించారు. ఇప్పటికే రెండు పాఠశాలల ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఉపాధ్యాయ వృత్తి కోర్సులు పూర్తిచేయడంతోపాటు సంబంధిత సబ్జెక్టులో ఏపీ టెట్‌/సీ.టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. రిజర్వేషన్ల కేటగిరీ ఆధారంగా పోస్టులను అందుబాటులో ఉంచారు. దశల వారీగా అన్ని జిల్లాల్లోని ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి ఎక్కడికక్కడే పాఠశాలల ప్రకటనలు జారీజేయనుంది. ప్రస్తుతం వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అర్భన్‌, రాజమహేంద్రవరం రూరల్‌లోని కొన్ని ఎయిడెడ్‌ పాఠశాలల్లో భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. కాకినాడలోని నవభారత్‌ హైస్కూల్‌లో పీఈటీ పోస్టులు 1, ఎస్‌ఏ/ పీజీటీ పోస్టులు 5, ఎస్‌జీటీ పోస్టులు 2 ఖాళీలను ప్రకటించారు. రాజమండ్రి రూరల్‌లోని మరో పాఠశాలలోను ఎయిడెడ్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాల వారీగా మిగిలిన పాఠశాలల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్దులు పోస్టును బట్టి ఇంటర్మీడియట్‌, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, పీజీ, బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు టెట్‌ లేదా సీటెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరిగా సాధించి ఉండాలి. స్కూల్‌ అసిస్టెంట్‌, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ తదితర ఉపాధ్యాయ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 16వేల ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ ప్రకటించగా..దానికితోడు ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరించడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఊరట చెందుతున్నారు. (Story : కాబోయే ఉపాధ్యాయులకు శుభవార్త)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version