Home వార్తలు జాతీయం పార్ల‌మెంటు ర‌ద్దుకు కుట్ర‌!

పార్ల‌మెంటు ర‌ద్దుకు కుట్ర‌!

0

పార్ల‌మెంటు ర‌ద్దుకు కుట్ర‌!

చట్టవిరుద్దంగా ఆర్డినెన్స్ ద్వారా పార్లమెంట్ రద్దు
జమిలి ఎన్నికలకు బిజెపి ప్రభుత్వ కుట్రలు
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ

న్యూస్‌తెలుగు/హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సంకిర్ణ ప్రభుత్వం రాజ్యాంగబద్దమైన హక్కులను కాలరాస్తూ చట్టవిరుద్దంగా ఆర్డినెన్స్ ద్వారా పార్లమెంట్ రద్దు చేసి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కుట్రలు చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. ‘వన్ నేషన్, వన్ రేషన్, వన్ ఓట్, వన్ ఎలక్షన్’ పేరుతో ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ తీసుకుంటున్న ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా సిపిఐ దేశ వ్యాప్త ఉద్యమాలు చేపట్టనున్నట్లు నారాయణ చెప్పారు. హైదరాబాద్ హిమాయత్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ కలిసి డాక్టర్ నారాయణ మాట్లాడారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబునాయుడు, బీహర్ సిఎం నితీష్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ది పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎక్స్ హైవే నిర్మాణాలకు సిపిఐ అభ్యంతరం చెప్పడం లేదని, అయితే అవి అందిరికీ ఉపయోగపడే విధంగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నారాయణ డిమాండ్ చేశారు. ఎక్స్ హైవేల నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను సేకరించి చివరికి వారికే దారిలేకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ హైవేల నిర్మాణంలో భాగంగా సర్వీస్ రోడ్డును నిర్మించి దానిని ఆనుకునే ప్రహారిగోడను సైతం నిర్మిస్తున్నారని, దీంతో రైతులు తమ పోలాలు, భూముల్లోకి వెళ్లేందుకు దారులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనిపై ఇటీవలే చిత్తూరు జిల్లాలో రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తే నిర్మాణ సంస్థ తాత్కాలికంగా ఇరు వైపుల రైతులకు దారి ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సమస్య దేశ వ్యాప్తంగా ఉందని, ఈ హైవేల నిర్మాణాల సమయంలోనే రైతులు తమ పోలాల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా వారి కోసం ఇరువైపులా ప్రత్యేక రోడ్డు నిర్మించాలని నారాయణ కోరారు. ఇందుకు సంబంధించి కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరికి సిపిఐ తరపున ఒక లేఖ రాసినట్లు నారాయణ తెలిపారు. కేంద్ర మంత్రికి రాసిన లేఖ ప్రతులను తెలంగాణ రాష్ట్ర సిఎం ఎ.రేవంత్ ఎపి సిఎం చంద్రబాబునాయుడుతో పాటు లోక్ రాజ్యసభ సభ్యులందరికీ పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్ అక్రమ నిర్మాణాలను తొలంగించాల్సిందేనని, అదేవిధంగా మూసీ ప్రక్షాళన సైతం చేయాల్సిందేనని డాక్టర్ నారాయణ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పేదలకు పునరావాసం కల్పించిన తర్వాతే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చట్టబద్దంగా ఏ పని చేసినా సిపిఐ సమర్థిస్తుందని, కానీ పేదలకు పునరావాసం కల్పించకుండా వారిని తరలించడం సమంజసం కాదన్నారు. చెరువులు, కుంటలు ఉంటే భూగర్భ జలాలు వృద్ది చెందడంతో పాటు కాలుష్యాన్ని సైతం నివారించగలుగుతామని, అందుకే వాటిని పరిరక్షించాల్సిందేనన్నారు. ఇందుకు చెరువులు, కుంటలను ఆక్రమించుకుని నిర్మించిన వాణిజ్యభవనాలు విల్లాలను తక్షణమే కూల్చివేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అదేవిధంగా వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఉన్న ఫిరంగి నాలాలపై ఆక్రమణలను తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేష్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇటివల సిపిఐ ప్రతినిధి బృందం హైడ్రా కమిషనర్ రంగానాధ్ కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే హైడ్రా మాత్రం బడా బాబులను జోలికి వెళ్లకుండా పేదల ఇళ్లును తొలగిస్తూ వారిని భయాభ్రంతులకు గురిచేయడం తగదన్నారు. పేదలకు పునరావాసం కల్పించిన తర్వాతే వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలన్నారు. అదే సమయంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మించిన విల్లాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లలోని నిర్మాణాలను తక్షణమే తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. (Story: పార్ల‌మెంటు ర‌ద్దుకు కుట్ర‌!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version