ధర్మవరం ఆర్డీవో గా ఏ. మహేష్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం ఆర్డీవో గా ఏ. మహేష్ బదిలీగా రానున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్డీవో ఎం. వెంకట శివరామిరెడ్డి ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికల విధుల భాగంగా ధర్మవరం ఆర్డీవో గా కొనసాగారు. వీరిని మంగళగిరి సచివాలయ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ధర్మవరం ఆర్డీవోగా రానున్న ఏ. మహేష్ అడిషనల్ కమిషనర్ గా విజయవాడలో విధులు నిర్వర్తిస్తూ బదిలీగా రానున్నారు. మరో రెండు రోజుల్లో రానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. (Story :ధర్మవరం ఆర్డీవో గా ఏ. మహేష్ )