జాతీయ యంత్రీకృత పారిశుద్ధ్య వ్యవస్థ చర్య
న్యూస్ తెలుగు/ మేడిపల్లి:పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో గురువారం ఉదయం జాతీయ యంత్రీకృత పారిశుద్ధ్య వ్యవస్థ చర్య (నమస్తే) కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్, మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వర్ రావు పాల్గొన్నారు. కామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పారిశుద్ధ్య వ్యవస్థ చర్య తీసుకునే పలు కీలక అంశాలపై డాక్టర్ స్మిత్ సింగ్, మితిన్ కుమార్ ప్రసంగించారు. ఈ పథకం స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కింద ప్రారంభించబడింది. దీని ముఖ్య ఉద్దేశ్యం మానవ శ్రమను తగ్గించడం మరియు యంత్రాల ద్వారా పారిశుద్ధ్య పనులను నిర్వహించడం. ప్రధాన అంశాలు పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య బీమా. శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణం. పారిశుద్ధ్య సంబంధిత వాహనాలు మరియు పరికరాల కొనుగోలుకు మూలధన సబ్సిడీ. ఈ పథకం ద్వారా,ప్రతి మాన్హోల్‌ను యంత్రాల ద్వారా నిర్వహించేలా మారుస్తారు, తద్వారా పారిశుద్ధ్య కార్మికుల భద్రత మరియు గౌరవం పెరుగుతుందని అన్నారు.