పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం
ప్రిన్సిపాల్ ప్రశాంతి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం ఉంటుందని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛత హి సేవ ప్రోగ్రాం స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభించి పదేళ్లు పూర్తైన సందర్భంగా స్వచ్ఛతా హి సేవా 9వ రోజు కార్యక్రమంలో భాగంగా ధర్మవరం బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అందరితోనూ స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ చేయించడంతో పాటుగా కళాశాల ఆవరణంలో పురపాలక సిబ్బందితో కలసి కలుపు మొక్కలను తొలగించి, పరిశుభ్రం చేయడంతో పాటు “స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత” నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని కళాశాల ప్రిన్సిపాల్ వై. ప్రశాంతి మేడం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సి. కుళ్ళాయి రెడ్డి,అధ్యాపకులు పురపాలక కార్యాలయం శానిటరి ఇన్స్పెక్టర్ శ్యాంషన్, కేశవ, వార్డు శానిటేషన్ కార్యదర్శిలు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు. (Story : పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం )