స్వర్ణాంధ్ర 2047లో ప్రజలు స్వచ్చందంగా భాగస్వాములు కండి
వీఎంసీ ప్రత్యేక అధికారి వసీం బేగ్
న్యూస్ తెలుగు/విజయవాడ : క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటం ద్వారా స్వర్ణాంధ్ర 2047లో భాగస్వాములు కావాలని కార్యక్రమ ప్రత్యేక అధికారి వసీం బేగ్ పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కమీషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర ఆదేశాల మేరకు 12వ డివిజన్ అయ్యప్పనగర్‌లోని సచివాలయం 51 వద్ద ప్రత్యేక అధికారి వసీం బేగ్ ఆధ్వర్యంలో మంగళవారం వార్డు సభ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 100 రోజుల ప్రభుత్వ కార్యకలాపాలపై విపులంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి వసీం బేగ్ మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వమని ప్రచారం నిర్వహ్చింటంతో పాటు విజన్ స్వర్ణాంధ్ర 2047 గురించి ప్రజలకు వివరించారు. 2047 విజన్ సాధనకు కీలక అంశాలపై చర్చించటంతో పాటు దాని లక్ష్యాలు, అందుకు ప్రజలు స్వచ్చందంగా చేయాల్సిన కృషిపై ఆయన స్వయంగా అవగాహన కల్పించారు. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా స్వర్ణాంధ్ర 2047లో చురుగ్గా పాల్గొనటంతో పాటు జ్రలు తమ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రజలను చైతన్య పర్చారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ప్రజలు స్వయంగా భాగస్వాములై విజయవంతం చేసేందుకు తమ వంతు బాద్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పీ.సాయిబాబు, టీడీపీ డివిజన్ అధ్యక్షులు ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. (Story : స్వర్ణాంధ్ర 2047లో ప్రజలు స్వచ్చందంగా భాగస్వాములు కండి)