నేడు ప్రజావాణి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్
న్యూస్ తెలుగు /ములుగు : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే, ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.ఈ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులు, 9 మండలాల తహసీల్దార్లు, ఎం పి. డి. ఓ. లు, ఎం.పి. ఓ.లు తప్పకుండా హజరు కావాల్సిందిగా ఆయన ఆదేశించారు. (Story : నేడు ప్రజావాణి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి)