ఆర్థిక సంక్షోభంలోను సంక్షేమ పథకాలు అమలు
100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం
దేశంలోనే తిరుగులేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించిన కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా వినుకొండను తీర్చిదిద్దుతా
తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.
ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాష్ట్రం ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందని అందుకు 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే నిదర్శనమని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 11,12వ వార్డుల్లో వినుకొండ మునిసిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ” ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై వార్డులను సందర్శించి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒక్కసారిగా 4000, దివ్యాంగులకు 6000 పెంచడమే కాక, మొదటి నెలలో ఒక్కొక్కరికి 7000 రూపాయలు చొప్పున అందించడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్రని ఆయన పేర్కొన్నారు. 1674 కోట్లు దాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి ఆదుకున్నారని, నిధులు అందించి పంచాయతీలకు ప్రాణం పోసారన్నారు. ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు అందించడం, పేదల కోసం రాష్ట్రవ్యాప్తంగా కేవలం రూ. 5 ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించడం జరిగింది అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించాలని దిశగా పనిచేస్తున్నాయన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకారం చేస్తుందని ఆ దిశగా కేంద్రం సహకారం అందిస్తుందని ఆ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల విజయవాడ నగరం వరదలలో ఆర్థిక నష్టాన్ని ఆపలేకపోయిన ప్రాణ నష్టం లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడాలని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం అన్యాయంగా అర్హులైన వారికి కూడా పెన్షన్ ఇవ్వలేదని, అటువంటి వారిని గుర్తించి అర్హత మేరకు పెన్షన్లు అందించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపట్టిందని అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజు నుండి కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన “ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్” ను రద్దుచేసి ప్రజల ఆస్తులకు భద్రతను కల్పించడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీని త్వరలో కోటని ప్రభుత్వం చేపడుతుందని వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు కాబట్టే నేడు రాష్ట్ర ప్రజలంతా “ఇది మంచి ప్రభుత్వం” అని ప్రశంసిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వినుకొండను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఘాట్ రోడ్డు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం, టిటిడి కళ్యాణ మండపానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని త్వరలో ఆ పనులు పూర్తి చేస్తామన్నారు. ఎన్ఎస్పి స్థలంలో జాషువా లైబ్రరీ, స్టేడియం, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్, పార్క్ తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. వినుకొండ పట్టణానికి శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరించడమే తన ధ్యేయమన్నారు. డ్రైనేజీ, వీధిలైట్లు, లో వోల్టేజీ తదితర ప్రజల మౌలికవస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరించే బాధ్యత తనదని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, అలాగే సంబంధిత అధికారులు పాల్గొన్నారు, మరియు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, నిస్శంకర రావు శ్రీనివాసరావు, టిడిపి నాయకులు పీవీ సురేష్ బాబు,గంధం కోటేశ్వరరావు, ఆయుబ్ ఖాన్, షమీం ఖాన్, తదితరులు పాల్గొన్నారు. (Story : ఆర్థిక సంక్షోభంలోను సంక్షేమ పథకాలు అమలు)