అభివృద్ధికి రెక్కలు తొడిగిన కూటమి ప్రభుత్వం
న్యూస్ తెలుగు/ చాట్రాయి : అబివృద్దికి రెక్కలు తొడిగిన చంద్రబాబు సేవలు మరువలేమని
“ఇది మంచి ప్రభుత్వమని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాస రావు కొనియాడారు.
ఆదివారం చాట్రాయి మండలం, చనుబండ గ్రామం లో కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా “ఇది మంచి ప్రభుత్వం” ప్రచార కార్యక్రమం సచివాలయం – 1 వద్ద నుండి సచివాలయం అధికారులు కూటమి నాయకులతో కలిసి ప్రచారం ప్రారంబించారు. 100 రోజులలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తిరిగి “ఇది మంచి ప్రభుత్వం” కరపత్రాలను పంచుతూ, డోర్ స్టిక్కర్లు అంటిస్తూ కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్బంగా మోరంపూడి మాట్లాడుతూ. చంద్రబాబు ప్రభుత్వ పాలన ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కందుల కృష్ణ, చీదిరాల మారేశ్వర రావు, పరసా శ్రీనివాస రావు, గుడిమళ్ళ బ్రహ్మయ్య, నక్కా రాము, నెక్కళపు వెంకటేశ్వర రావు, గవర వెంకటేశ్వర రావు, విస్సంపల్లి రాజా, బన్నె వీరయ్య, ఉదయ్ కిరణ్, పరమేష్, సన్నీ, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : అభివృద్ధికి రెక్కలు తొడిగిన కూటమి ప్రభుత్వం )