Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విలువలుతో బోధిస్తాం.. సంస్కారవంతులుగా తీర్చి దిద్దుదాం

విలువలుతో బోధిస్తాం.. సంస్కారవంతులుగా తీర్చి దిద్దుదాం

విలువలుతో బోధిస్తాం.. సంస్కారవంతులుగా తీర్చి దిద్దుదాం

కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత రెడ్డి

న్యూస్‌తెలుగు// ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : విలువలతో బోధిస్తాం సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాం అని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మానవతా స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్దులు నేర్పుతున్న గురువులకు, విద్యార్థి దశలోనే తెలుసుకొని ఆచరించదగిన విషయాలు మీ సొంతమటలలో తెలపండి? అనే అంశం మీద వ్యాసరచన పోటీలు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్తినులకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రథమ బహుమతి శిరీష బాయి, ద్వితీయ బహుమతి రమానా ఫిరదోస్, తృతీయ బహుమతి హరిణి విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి కాంత రెడ్డి చేతులమీదుగా సర్టిఫికెట్ మొమెంటో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు పెద్దన్న, మానవతా సంస్థ ఛైర్మెన్ తల్లo నారాయణ మూర్తి , అధ్యక్షులు చిన్నప్ప, ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, కార్యదర్శి మంజునాథ్, ఉపకార్యదర్శి రామకృష్ణ, అకాడమిక డైరెక్టర్స్ రామకృష్ణ, సాయిప్రసాద్ డైరెక్టర్లు మనోహర్ గుప్తా, జగ్గా నాగరాజు, సభ్యులు నాగభూషణం, హరినాథ్ పాల్గొన్నారు. (Story : విలువలుతో బోధిస్తాం.. సంస్కారవంతులుగా తీర్చి దిద్దుదాం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!