మహిళా కానిస్టేబుల్ మృతి
సంతాపం తెలిపిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం యాపర్ల గ్రామానికి చెందిన శ్రావణి అనే మహిళ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు కారు లారీ ఢీకొని చనిపోయిన విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి యాపర్ల గ్రామానికి వెళ్లి శ్రావణి భౌతిక కాయం పై పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యం కల్పించడం జరిగింది. శ్రావణి అకాల మరణం పోలీస్ వ్యవస్థకు తీరని లోటు అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విక్రమ్ గౌడ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మత్స్యకార సెల్ అధ్యక్షుడు నందిమల్ల యాదయ్య, పిఆర్ఓ భాస్కర్ ,పెద్దమందడి సోషల్ మీడియా గట్టు రాజు ,గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరాలు ఉన్నారు.