Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాటం ఉధృతం

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాటం ఉధృతం

0

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాటం ఉధృతం

పరిరక్షణ వేదిక పిలుపు

న్యూస్‌తెలుగు/ విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా పరిరక్షణ వేదిక భావించింది. ఈ మేరకు వేదిక నాయకులు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సమావేశమయ్యారు. పోమ్మన కుండా పొగబెట్టాలేగా విశాఖ స్టీల్ పరిశ్రమ నడక ఉందని నాయకుల అభిప్రాయపడ్డారు. పరిశ్రమకు కావలసిన ముడి పదార్థాలైన బొగ్గు, ఇనుము సొంత ఖనిజాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని నాయకులు ప్రశ్నించారు. ఇప్పటికే రెండు సెక్షన్లు మూతపడ్డాయని, మరో మూడో సెక్షన్ మూతపడడానికి సిద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే ప్రైవేటీకరణకు పూర్తిగా సహకరిస్తున్నాయని, సమర్థిస్తున్నాయని విమర్శించారు. జనసేన అధినేత, రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందే కార్మిక సంఘాల పురుడు పోసుకున్నాయని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కార్మిక సంఘాల ప్రతినిధులు కలిసినప్పుడు ఎవరి పని వారిదేనని, కార్మిక సంఘాల తమ పనిని తాము చేసుకోవచ్చని, ప్రభుత్వాల తమ పని తాము చేస్తాయని, ప్రైవేటీకరణ సమర్థించినట్లుగా మాట్లాడారని నాయకులు తెలిపారు. వాస్తవానికి గత ఎన్నికల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన వినతి పత్రాన్ని, ఆయన చేసిన వాగ్దానాలు ఆధారాలు ఉన్నాయన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ సమర్థించటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా తమ నిజాయితీని చెత్తశుద్ధిని నిరూపించుకోవడానికి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక సంఘాల్ని ఢిల్లీకి ప్రతినిధి బృందంగా పంపాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక ఉద్యమాలను ఆపటం ఎవరి తరం కాదన్నారు. పోరాటం తప్పదు, కాపాడుకోవడానికి మరో మార్గం లేదన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి పోరాటాల కొత్త కాదని, వాటిని ఆపాలనుకునే వారికి అసాధ్యమైన పనని హెచ్చరించారు. వివిధ రూపాల్లో దశల వారి పోరాటాలని, ఆందోళనలని ఉధృతం చేస్తామన్నారు. అక్టోబర్ 2 కార్మిక సంఘాలు, అక్టోబర్ 3 రైతు సంఘాలు, అక్టోబర్ 4 అన్ని ప్రజా సంఘాలు తమ ఆందోళనని నిర్వహిస్తాయని తెలిపారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి కేంద్ర స్టీల్ మంత్రి స్వామి ఇప్పుడు మాసాల క్రితం కూడా ప్రైవేటీకరణ చేయమని హామీ ఇచ్చి, దొడ్డిదోవన ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. 120 శాతం లాభాల్లో ఉందని, 945 కోట్లు లాభాల్లో ఉందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రైవేటీకరణ చేయటం బిజెపి లక్ష్యంగా పెట్టుకుందని అర్థమవుతుందన్నారు. మూడున్నర సంవత్సరాలు పోరాట ఫలితంగా ప్రైవేటీకరణ ఆపగలిగామని, మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ బిజెపి ప్రభుత్వం మరలా ప్రైవేటీకరణను వేగవంతం చేసిందని దుయ్యబెట్టారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం బాటలోనే టిడిపి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అదే బాటలో పయనిస్తుందని విమర్శించారు. గతంలో పార్లమెంటు సభ్యుడు యంవిఎస్ ఎన్ మూర్తి ప్రైవేటీకరణను సమర్ధించారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరో పోరాటాన్ని ఉధృతం చేస్తామని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి వేదిక కన్వీనర్ వి. ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో వేదిక మరో కన్వీనర్, ఏఐటీయూసీ నాయకులు ఈ ఓబులేసు, సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు పి పోలారి, మోహన్, రైతు సంఘం నాయకులు ఎం కృష్ణయ్య, ఎం హరిబాబు, వెలగపూడి అజాద్, యం.వెంకటరెడ్డి, కొల్లా రాజమోహన్, యు వీరబాబు, టియుసిఐ రాష్ట్ర కన్వీనర్ మరీదు ప్రసాద్ బాబు, టి ఎన్ టి సి నాయకులు ఆర్.శ్యామ్, రిటైర్డ్ ఐఏఎస్ బి శ్రీనివాసులు, భారత్ బచావో నాయకులు మాసియాంగ్, విద్యార్థి యువజన నాయకులు పాల్గొన్నారు. సమావేశాన్ని ఏఐటిసి నాయకులు వెంకటసుబ్బయ్య వందన సమర్పణ చేశారు. (Story : విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాటం ఉధృతం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version