Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగస్తులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు

ఉద్యోగస్తులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు

0

ఉద్యోగస్తులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు

న్యూస్ తెలుగు /సాలూరు : ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించి వేరే చోటికి వెళ్లకపోతే మీ అంతు చూస్తామని తెలుగుదేశం నాయకులు బెదిరిస్తున్నారు .ఉద్యోగస్తులను పిలిచి భయపెట్టి,బాధ పెట్టి,వేరే చోటకి వెళ్లిపోమని టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర అన్నారు మంగళవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను మంత్రిగా ఉండేటప్పుడు వినాయక నిమజ్జనం 21 రోజులు ఉండేదని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది రోజులకే నిమజ్జనం చేయాలని అనడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని అన్నారు. సాలూరు గ్రామ దేవత అయిన శ్యామలాంబ పండుగ చేయాలని ఎన్నోసార్లు ఆలయ కమిటీ వారికి చెప్పడం జరిగిందని వారి ముందుకు రాలేదని అన్నారు. వైయస్సార్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి స్వార్థపరులే వెళతారని పదవులు. పనులు చేసుకోవడానికి మాత్రమే పార్టీ మారుతారని అన్నారు. గత 18 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి ఏ ఒక్క వ్యక్తికి అయినా అన్యాయం చేశానా అని అన్నారు. సాలూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు నిమ్మాది.చిట్టి అంగన్వాడీ ఉద్యోగం కోసం నా దగ్గరకు రాలేదా అని అన్నారు సాలూరు అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో కాంట్రాక్టు వర్కులు కోసం నా దగ్గరకు రాలేదా నా దగ్గర వర్కులు తీసుకోలేదా అలాంటి వ్యక్తి నా గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సాలూరు మండలంలో గిరిజన మహిళా ఎంపీటీసీని కులం పేరుతో దూషించి జుత్తు పట్టి ఊడ్చి కెళ్ళిన చరిత్ర తెలుగుదేశం పార్టీ దీ అని అన్నారు స్వార్ధపరులే టీడీపీకి వెళతారు మాట్లాడే ముందు టీడీపీ నాయకులు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు కౌన్సిలర్లు గిరి రఘు వైయస్సార్ పార్టీ నాయకులు పిరిడి రామకృష్ణ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. (Story : ఉద్యోగస్తులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version