కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు పల్నాటి గడ్డపై తిరుగులేని ప్రజానాయకుడు కోడెల శివప్రసాద్ 5వ వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయునికి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు మరియు నాయకులు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఆయుభ్ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం కోడెల శివప్రసాద్ ఐదో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలు ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు మరియు టిడిపి నాయకులు పాల్గొని వారికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మక్కెన మల్లికార్జున మాట్లాడుతూ కోడెల శివప్రసాద్ రాష్ట్రం దేశం గర్వించదగ్గ నాయకుడని వారు అన్ని శాఖల్లో పని చేశారని చివరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవ్యాంధ్ర తొలి స్పీకర్ గా చేసిన ఘనత వారికే దక్కుతుందని వారి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి చెందిందని, అలాగే భవిష్యత్తులో వారిని ఆదర్శంగా తీసుకొని మన నియోజకవర్గంలో కూడా జీ.వీ ఆంజనేయులు మరియు ఎంపీ వినుకొండ నీ అభివృద్ధి పథంలో నడుపుతారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాష్ట్ర టిడిపి కార్యదర్శి షమీంఖాన్, పెమ్మసాని నాగేశ్వరరావు, జరపాల గోవింద నాయక్, రోడ్డ వీరాంజనేయరెడ్డి, కర్నాటి వెంకటరెడ్డి, పత్తి పూర్ణచంద్రరావు, పెసల వెంకటనారాయణ, వజ్రాల కృష్ణారెడ్డి, సోమేపల్లి శ్రీనివాసరావు, సౌదాగర్ జానీ భాష, భత్తుల గోవిందరాజులు,ఆళ్ల మన్నయ్య, గట్టుపల్లి శ్రీనివాసరావు, వెంకటేశ్వర రెడ్డి, చికెన్ బాబు, దస్తగిరి, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. (Story : కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి)