UA-35385725-1 UA-35385725-1

‘సుబ్రహ్మణ్య’- బియాండ్ ఇమాజినేషన్ గ్లింప్స్ రిలీజ్

‘సుబ్రహ్మణ్య’- బియాండ్ ఇమాజినేషన్ గ్లింప్స్ రిలీజ్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన దర్శకత్వంలో “సుబ్రహ్మణ్య”సినిమాతో తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామలక్ష్మి సమర్పిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్‌, ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అన్నీ వైపుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

దుబాయ్‌లో జరిగిన ప్రముఖ అవార్డు ఫంక్షన్‌లో భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తన్ని ఆకట్టుకునే మూవీ గ్లింప్స్ ని లాంచ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ కు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి యునానిమస్ గా అద్భుతమైన స్పందన అందుకుంది.

విషపూరిత పాములతో నిండిన బావిలోకి అద్వాయ్ జంప్ చేయడంతో టీజర్ ఓపెన్ అవుతోంది. అతను దొంగచాటుగా లోపలికి ప్రవేశించి, ఒక పురాతన పుస్తకాన్ని తీసుకొని, అన్ని పాములు తనను వెంబడించడంతో పరుగెత్తడం ప్రారంభిస్తాడు. VFX , యానిమేషన్ అత్యుత్తమంగా ఉన్నాయి,  ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాయి. టీజర్ లో కనిపించిన భారీ వానరాలు ఆసక్తిని మరింతగా పెంచాచాయి.  దర్శకుడు పి రవిశంకర్ గ్లింప్స్ తో మెస్మరైజ్ చేశారు. టీజర్ చివరి షాట్ మహాఅద్భుతంగా వుంది. ఈ విజువల్ వండర్ గ్లింప్స్ తో సుబ్రహ్మణ్య ఈ ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటిగా మారింది.

విదేశాల్లో శిక్షణ తీసుకున్న అద్వాయ్ తెరపై అద్భుతంగా కనిపిస్తున్నాడు. అతని ప్రజెన్స్, ఎక్స్ ప్రెషన్స్, ఆటిట్యూడ్ చార్మ్ అండ్ ఎనర్జిటిక్ గా వున్నాయి.

పి రవిశంకర్ గొప్ప అనుభూతిని అందించే అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని రూపొందించారు. భగవాన్ శ్రీ రాముడు కనిపించిన చివరి సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది, గూస్‌బంప్‌లను తెస్తుంది.

విఘ్నేష్ రాజ్ కెమెరా పనితనం అద్భుతంగా వుంది. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. సప్త సాగరదాచే,  చార్లీ 777 చిత్రాలతో ఆకట్టుకున్న ఉల్లాస్ హైదూర్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్,  విజయ్ ఎం. కుమార్ ఎడిటర్.

ఈ అద్భుతమైన ఫైనల్అవుట్‌పుట్‌ను సాధించడానికి అరవై మందికి పైగా VFX ఆర్టిస్ట్  ఈ టీజర్‌పై నాలుగు నెలలకు పైగా పనిచేశారు. ‘సుబ్రహ్మణ్య’  క్రియేటివ్ ప్రొడ్యూసర్ & VFX సూపర్‌వైజర్ నిఖిల్ కోడూరు నేతృత్వంలో, విజువల్స్ ముంబై, హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నైలోని ప్రసిద్ధ స్టూడియోలలో రూపొందించబడ్డాయి. భారతదేశపు ప్రీమియర్ కలర్ గ్రేడింగ్ స్టూడియోలలో ఒకటైన ‘Red Chillies.color’ ఈ చిత్రానికి కలర్ గ్రేడింగ్ పార్టనర్‌గా ఉంది, సీనియర్ కలరిస్ట్ కెన్ మెట్జ్‌కర్, కలరిస్ట్ దేవాన్షి దేశాయ్‌ గ్రేట్ వర్క్ అందించారు.

ప్రీమియం లార్జ్ ఫార్మాట్, IMAX థియేటర్లలో విజువల్ వండర్, అడ్వంచర్  థ్రిల్లర్‌ను అందించడానికి ఈ చిత్రాన్ని లార్జ్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. లాంగ్వేజ్ బారియర్ అధిగమించే కథతో ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ విజువల్, ఎమోషనల్ ట్రీట్‌గా తీర్చిదిద్దుతున్నారు.

పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. (Story : ‘సుబ్రహ్మణ్య’- బియాండ్ ఇమాజినేషన్ గ్లింప్స్ రిలీజ్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1