ఘనంగా జరిగిన గోనుగుంట్ల నితిన్ సాయి జన్మదిన వేడుకలు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కుమారుడైన గోనుగుంట్ల నితిన్ సాయి పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని ప్రియాంక నగర్ లో అభిమానులు, నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆఫీసులో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు సాహెబ్బి, సుజాతమ్మ, ప్రభావతి తోపాటు అరవింద్ రెడ్డి, వీరన్న, చల్లా హరి, బొట్టు శీనా, మల్లాకాలవ రాముడు, రామకృష్ణ, సే క్షావలి, సుబ్బారావు పేట గంగాధర్, ఇమామ్ సాబ్, గంగాధర్, జయశంకర్, ఆదెప్ప సుబ్బరాయుడు తో పాటు 40వ వార్డు నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story : ఘనంగా జరిగిన గోనుగుంట్ల నితిన్ సాయి జన్మదిన వేడుకలు)