Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులుగా కోలా లక్ష్మీపతి 

తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులుగా కోలా లక్ష్మీపతి 

0

తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులుగా కోలా లక్ష్మీపతి 

న్యూస్‌తెలుగు/తిరుపతి : ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఏ.పీ.ఏం.పి. ఏ.) తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులుగా కోలా లక్ష్మీపతి ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ ప్రకటించారు. సోమవారం స్థానికంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వీర్ల శ్రీరామ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ పనిచేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులు వృత్తి పరంగానే కాక గత ప్రభుత్వాల హయాంలో జర్నలిస్టులకు ఉన్న సంక్షేమ పథకాలు కూడా కోల్పోయి ఇబ్బంది పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జర్నలిస్టు సంక్షేమంపై రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి, నూతన సమాచార కమిషనర్ కు వినతిపత్రాలు సమర్పించామన్నారు. అందులో భాగంగా జర్నలిస్టుల హెల్త్ కార్డుల పునరుద్ధరణ జరిగిందని అందుకు సమాచార, ఆరోగ్య శాఖ మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఆక్రిడిటేషన్ పరంగా గత ప్రభుత్వం విధించిన నిబంధనలను సరళీకరించాలని, వర్కింగ్ జర్నలిస్టు అందరికీ అక్రిడిటేషన్ మంజూరు చేయాలని,జర్నలిస్టు హెల్త్ కార్డుల పరిమితి 5 లక్షలకు పెంచాలని, తక్షణమే జర్నలిస్టుల 10 లక్షల భీమా సౌకర్యాన్ని 20 లక్షలకు పెంచి పునరుద్ధరించాలని ఆయన డిమాండు చేశారు. జర్నలిస్ట్ పిల్లలకు విద్యాసంస్థల్లో ఫీజ్ రాయితీ జీవోను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేయాలన్నారు. కరోనా లో చనిపోయిన పాత్రికేయ మిత్రుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా తక్షణం అందజేయాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిస్వార్ధంగా సేవలను అందిస్తూ చనిపోయిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు, 20. సంవత్సరాలు జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్న జర్నలిస్టులందరికీ పలు రాష్ట్రాలలో అమల్లో ఉన్న విధంగా నెలకి రూ.10,000 గౌరవ పెన్షన్ స్కీమును జర్నలిస్టులకు అమలు చేయాలని, జర్నలిస్టులకు ఇంటి స్థలం,ఇళ్ల నిర్మాణంకు ప్రభుత్వం సానుకూలంగా జీవో ఇవ్వాలని ఆయన కోరారు. ఏపీ.ఏం.పి. ఏ. తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు గా నియమితులైన కోలా లక్ష్మీపతి నేతృత్వంలో సీనియర్ జర్నలిస్టులు సి.బి. మోహన్ రావు, జి గాంధీ, కాటా కృష్ణ, ఏర్పేడు హరిబాబు, తులసి రామ్ చిత్తూరు, వంశీకృష్ణ రేణిగుంట, కోయల శ్రీనివాసులు తిరుమల, కుమార్ రాయల్ తిరుమల, ముద్దా బాలు యాదవ్, మణి తదితరులు ఉమ్మడి జిల్లాలలో సభ్యత్వం పూర్తి చేసుకుని ఏపీ.ఏంపి. ఏ.రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version