Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బుడమేరు పూర్తి విస్తరణపై నివేదికివ్వండి

బుడమేరు పూర్తి విస్తరణపై నివేదికివ్వండి

0

బుడమేరు పూర్తి విస్తరణపై నివేదికివ్వండి

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జీ.సృజన

న్యూస్‌ తెలుగు/విజయవాడ : బుడమేరు ముంపు నుంచి జిల్లా, నగరానికి శాశ్వత పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, దీనిలో భాగంగా సర్వే, ల్యాండ్‌ రికార్డ్సు, ఇరిగేషన్‌, వీఎంసీ సిటీప్లానింగ్‌, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా ఆక్రమణకు గురైన పూర్తి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జీ.సృజన ఆదేశించారు. బుడమేరు ఆక్రమణల గుర్తింపుకు తొలిదశలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌ బుధవారం సర్వే, భూ రికార్డులు, వీఎంసీ, రెవిన్యూ అధికారులతో స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన కుంభవృష్టితో ఊహించని విదంగా ప్రమాదకర స్థాయిలో 43వేల క్యూసెక్కుల వరద పోటెత్తటంతో గండ్లు పడి విజయవాడ రూరల్‌, నగర పరిదిలోని పలు ప్రాంతాలు, పంట పొలాలు జలమయం కావటంతో నగరంలో 2 లక్షల కుటుంబాలకుపైగా ముంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఆపరేషన్‌ బుడమేరును ప్రకటించారన్నారు. ఈ నేపధ్యంలో బుడమేరు ఆక్రమణలకు సంబందించిన జలవనరుల శాఖకు సంబందించి అర్బన్‌, సిటీ పరిధిలో కాలువ విస్తీర్ణానికి నివేదికలను రూపొందించాల్సి ఉందని తెలిపారు. యుద్ద ప్రాతిపదికన ఆక్రమణల తొలిగింపుకు ప్రభుత్వం సిద్దమవుతోందని, ఆక్రమణల వాస్తవ వివరానలు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ డా.నిదిమినా, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్సు ఏడీ శ్రీనివాసు, వీఎంసీ సీపీ ప్రసాద్‌ పాల్గొన్నారు (Story : బుడమేరు పూర్తి విస్తరణపై నివేదికివ్వండి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version