Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పోలీసులను దులిపేసిన ముంబ‌యి న‌టి!

పోలీసులను దులిపేసిన ముంబ‌యి న‌టి!

పోలీసులను దులిపేసిన ముంబ‌యి న‌టి!

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో సినీనటి జ‌త్వానీ
ఎస్.ఐ. పాపారావును చూడగానే నువ్వింకా ఇక్క‌డే ఉన్నావా అంటూ షాక్‌
న‌న్ను ఎంత ఏడిపించార్రా బాబూ అంటూ కామెంట్లు
మీడియాను ప‌క్క‌కు పిలిచి మంత్రి ఓడినా ఐదేళ్లూ ఎస్ఐ ఈ స్టేష‌న్‌లోనే ఉన్నాడా అంటూ గుస‌గుస‌

విజ‌య‌వాడ: వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన నాయ‌కులు, పోలీసుల‌తో వేధింపుల‌కు గురైన‌ట్లుగా చెప్ప‌బ‌డుతున్న ముంబ‌యి న‌టి కాదంబ‌రీ జత్వానీ తాజాగా ఇబ్రహీంప‌ట్నం పోలీస్‌స్టేష‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇదే స్టేష‌న్‌లో ఆమెపై కేసు న‌మోదుకాగా, ఆమె కూడా తాజాగా ఇదే స్టేష‌న్‌లో మ‌రో కేసు పెట్ట‌డానికి వ‌చ్చారు. స్టేష‌న్‌లోప‌లికి వెళ్ల‌గానే ఆమె ఎస్ఐ పాపారావును చూసి అవాక్క‌యింది. వెంట‌నే ఆమె విరుచుకుప‌డింది. ఆ రోజు చాలా చేసావ్.. అన్ని మర్చిపోలేను.. మీ స్టేషన్లో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా.. ఇప్పటికీ ఇక్కడే ఉన్నారా.. అంటూ దుయ్య‌బ‌ట్టారు. ఆరోజు కనీసం దయ చూపకుండా తీవ్రంగా ఎస్సై పాపారావు త‌న‌ను వేధించార‌ని బాధిత వ్యక్తి, సినీనటి జ‌త్వానీ అన్నారు. ఆ స‌మ‌యంలో పోలీసులు ఏమీ మాట్లాడలేక నిశ్చేష్టుల‌య్యారు. ఎస్సై పాపారావును చూడగానే జ‌త్వానీలో ఆవేదన ఒక్కసారిగా బైటకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హ‌యాంలో ముంబయి నుంచి ఆమెను ఇబ్రహీంపట్నం స్టేషన్ కు తీసుకు వచ్చిన సమయంలో ఒక్కో పోలీసు అధికారి, సిబ్బంది ఆమె పట్ల వ్యవహరించిన తీరు కళ్ళ ముందు మొదలాడింద‌ని ఆమె అన్నారు. అక్కడే ఎస్.ఐ పాపారావు కనపడటంతో ఆమె ఆపుకోలేక ఆవేద‌న వెలిబుచ్చింది. (ఇది ఆక్రందనతో కూడిన ఆగ్రహం కావచ్చు..). ఇదిలాఉండ‌గా, గత ఐదేళ్లుగా పాపారావు ఇదే స్టేష‌న్‌లో ఎస్ఐగా కొన‌సాగుతున్నారు. ఆనాటి మంత్రి జోగి రమేష్ అండతోనే ఆయ‌న‌ ఒకే స్టేషన్లో విధులు నిర్వహిస్తూనే ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదే విష‌యాన్ని జ‌త్వానీ మీడియా ప్ర‌తినిధుల‌తో అన‌డం గ‌మ‌నార్హం. (Story: పోలీసులను దులిపేసిన ముంబ‌యి న‌టి!)

The News in YouTube (Video)⇓

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments