UA-35385725-1 UA-35385725-1

గంజాయి కేసుల్లో ప్రధాన సూత్రదారులను అరెస్టు చేయాలి

గంజాయి కేసుల్లో ప్రధాన సూత్రదారులను అరెస్టు చేయాలి

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్

న్యూస్‌తెలుగు/ విజ‌య‌న‌గరం : గంజాయి కేసుల్లో ప్రధాన నిందితులను గుర్తించి, అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ సీజ్ చేసిన గంజాయిని మెజిస్ట్రేటు గారి సమక్షంలో ఇన్వెంటరీ చేయించాలన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్

జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదై, దర్యాప్తులో ఉన్న గంజాయి కేసులను, మిస్సింగు కేసులను, సైబరు మోసాల కేసులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు సెప్టెంబరు 12న జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించి, సంబంధిత దర్యాప్తు అధికారులకు చేపట్టాల్సిన చర్యల గురించి దిశా నిర్దేశం చేసారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – గంజాయి రవాణ నియంత్రించేందుకు ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది తమ స్టేషను పరిధిలో కఠిన చర్యలు చేపట్టాలన్నారు. వివిధ పోలీసు స్టేషను పరిధిలో దర్యాప్తులో ఉన్న గంజాయి కేసుల్లో గుర్తించిన ప్రధాన పాత్రదారులు, సూత్రదారులను, పరారీలో ఉన్న నిందితులను తప్పనిసరిగా అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. నిందితుల ఆచూకీని కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతికత పరిజ్ఞానంతో సమాచారం సేకరించి, వారిని అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన గంజాయిని సంబంధిత న్యాయమూర్తుల సమక్షంలో ఇన్వెంటరీ చేయించాలని, అందుకు తగిన ఉత్తర్వులను త్వరితగతిన పొందాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తు పూర్తయిన గంజాయి కేసుల్లో ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేసిన కేసుల్లో సంబంధిత న్యాయ స్థానాల నుండి సిసి నంబర్లు పొందాలన్నారు. పరారీలో ఉన్న ఇతర రాష్ట్రాల నిందితుల కోసం ప్రత్యేక బృందాలను పంపాలని, అందుకు సంబంధించిన అనుమతులను సంబంధిత అధికారులు తప్పనిసరిగా పొందాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.

అదే విధంగా వివిధ పోలీసు స్టేషనుల్లో దర్యాప్తులో ఉన్న అదృశ్యం కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, ఆయా కేసుల్లో ఇంత వరకు సంబంధిత అధికారులు చేపట్టిన దర్యాప్తును పరిశీలించారు. అదృశ్యం కేసుల పట్ల అలసత్వం వద్దన్నారు. కేసు నమోదైన వెంటనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని, అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీని సాంకేతికత ఆధారంగా కనుగొని, వారి తల్లిదండ్రులకు అప్పగించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.

వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదైన సైబరు మోసాల కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, ఆయా కేసుల్లో నిందితుల బ్యాంకు అకౌంట్లలో ఫ్రీజ్ అయిన మొత్తాన్ని బాధితులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఇందుకుగాను ఆయా కేసుల్లో సంబంధిత న్యాయ స్థానాల్లో మెమోలు దాఖలుచేసి, సంబంధిత న్యాయమూర్తి అనుమతితో నిందితుల బ్యాంకు అకౌంట్లలో ఫ్రీజ్ అయిన మొత్తాన్ని బాధితుల బ్యాంకు ఖాతాలకు జమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని దర్యాప్తు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.

ఈ జూమ్ కాన్ఫరెన్సులో డిఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎం.వీరకుమార్, పి.శ్రీనివాసరావు, పలువురు సిఐలు,ఎస్ ఐలు పాల్గొన్నారు. (Story : గంజాయి కేసుల్లో ప్రధాన సూత్రదారులను అరెస్టు చేయాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1