విశ్వ సాయి జూనియర్ కళాశాలను సందర్శించిన గోనుగుంట్ల లీలావతి
న్యూస్‌తెలుగు/ వినుకొండ :విశ్వ సాయి జూనియర్ కళాశాలలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను సందర్శించి విద్యార్థులకు చదువు మరియు జీవన విధానం అనే అంశంపై చక్కటి ఉపన్యాసాన్ని అందించిన శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి. తన జీవితంలో స్వానుభవంతో నేర్చుకున్న జీవన సత్యాలను విద్యార్థులకు బోధించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సమాజ సేవకులు పివి సురేష్ బాబు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్, ప్రముఖ ఆడిటర్ మరియు బ్రాహ్మణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మంత్రిరాజు సత్యనారాయణ విచ్చేశారు. ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన లీలావతి ని కళాశాల తరఫున సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా బీఈడీ కళాశాల డైరెక్టర్ గాలి శ్రీనివాసరావు, కళాశాల డైరెక్టర్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస్ శర్మ, ప్రిన్సిపాల్ శ యడవల్లి శ్రీవల్లి, పావనీలు, ఇతర అధ్యాపక బృందం, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : విశ్వ సాయి జూనియర్ కళాశాలను సందర్శించిన గోనుగుంట్ల లీలావతి)